చిల్లర దొంగల గురించి విన్నాం, వీరిని చిల్లర దొంగలని కూడా అనలేం.. ఇది చదివి వీరిని ఏమనాలో మీరే చెప్పండి

కోట్లల్లో దొంగతనాలు చేసే వారు ఉంటే కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు.బంగారు ఆభరణాలు వంటివి దొంగిలించే వారి సంగతి పక్కన పెడితే జేబులు కొట్టేసేవారు ఇంకా ఇతరత్ర చిన్న చిన్న దొంగతనాలు చేసే వారిని చిల్లర దొంగలు అంటారు.

 Pan Shop Theft In Nagole Hyderabad-TeluguStop.com

అయితే చిల్లర దొంగల కంటే మరీ దీనమైన దొంగల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.ఒక పాన్‌ షాప్‌లో పడ్డ దొంగలు వారికి కావాల్సిన సిగరెట్లు మరియు పాన్‌ పరాకులు ఎత్తుకు వెళ్లడం జరిగింది.

అందుకే వారిని చిల్లర దొంగలు అనడం కంటే మరేదైనా పేరుతో పిలిస్తే బాగుంటుందేమో.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఈ చీప్‌ చిల్లర దొంగతనం మరెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌లో జరిగింది.

హైదరాబాద్‌ నాగోల్‌లో ఉండే ఒక పాన్‌ షాప్‌లో ఈ దొంగతనం జరిగింది.అయితే పాన్‌ షాప్‌లో సీసీ కెమెరా ఉండటం వల్ల దొంగలు ఎవరో తేలిపోయింది.దొంగలు తమకు కావాల్సిన సిగరెట్లను దొంగతనం చేసేందుకు షాప్‌కు కన్నం పెట్టడం ఇక్కడ గమనించదగ్గ విషయం.అయితే ఈ చీప్‌ చిల్లర దొంగతనం కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

చిల్లర దొంగల గురించి విన్నాం,

ఒక పాన్‌ షాప్‌కు కన్నం వేసేందుకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు.కారులో వచ్చి పాన్‌ షాప్‌కు కన్నం వేయడం ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.మరీ ఇంత నీచమా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.ఇక తన పాన్‌ షాప్‌లో దొంగలు పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమానికి చేదు అనుభవం ఎదురైంది.

షాప్‌ వైపుకు పోలీసులు కూడా రాకుండా ఎంక్వౌరీ చేస్తున్నాం అంటూ కేసు నమోదు చేసి వదిలేశారు.కేసు నమోదు విషయంలో కూడా పోలీసులు అలసత్వం చూపడంతో విమర్శలు తలెత్తుతున్నాయి.

ఈ చీప్‌ చిల్లర దొంగతనం ఖరీదు రెండున్నర లక్షలుగా చెబుతున్నారు.రెండున్నర లక్షల సిగరెట్లు మరియు ఇతర పాన్‌ షాప్‌లోని వస్తువులను దొంగిలించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube