క్రేజీ బజ్.. క్విక్ ప్రాజెక్ట్ చేయబోతున్న ప్రభాస్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అప్పటి నుండి ఈయన అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

 Pan India Star Prabhas To Do A Quick And Interesting Project, Maruthi, Prabhas, Pan India Film, Tollywood, New Project, Raja Deluxe-TeluguStop.com

ఒక సౌత్ ఇండియా హీరో ఈ రేంజ్ లో బాలీవుడ్ లో సినిమాలు చేయడం ఇంత వరకు ఎవ్వరికి సాధ్యం కాలేదు.

ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

అందులో రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కొత్త వేరియంట్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా..బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే కూడా చేస్తున్నాడు.

ప్రెసెంట్ ఈ మూడు సినిమాలు సెట్స్ మీదనే ఉన్నాయి.ఒకే సమయంలో మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ తీరిక లేకుండా సమయం గడుపుతున్నాడు.

అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండగానే ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికర టాక్ నడుస్తుంది.ప్రభాస్ ప్రెసెంట్ చేస్తున్న సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఒక క్విక్ ప్రాజెక్ట్ ని చెయ్యాలని అనుకుంటున్నాడట.

ప్రాజెక్ట్ గురించిన ఆసక్తికర అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నారు.వస్తున్న సమాచారం ప్రకారం.ఈ సినిమాను మారుతి తెరకెక్కించ నుండగా ఇది ఒక హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది అని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే ఆసక్తికర టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు టాక్.మరి ఇది క్విక్ ప్రాజెక్ట్ అయినా పాన్ ఇండియా లెవల్లో ఉండవచ్చని అనుకుంటున్నారు.

మొత్తానికి ప్రభాస్ ఈ క్విక్ ప్రాజెక్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Pan India Star Prabhas To Do A Quick And Interesting Project, Maruthi, Prabhas, Pan India Film, Tollywood, New Project, Raja Deluxe - Telugu Maruthi, Project, Pan India, Panindia, Prabhas, Raja Deluxe, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube