ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏమిటంటే?

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “బాహుబలి” చిత్రం ప్రభాస్ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.ఈ సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.

 Prabhas Creates Record In Facebook With 2.4crore Followers,prabhas,young Rebel S-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆ తర్వాత ప్రభాస్ చేయబోయే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు.
సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇప్పటివరకు సినిమాల పరంగా మంచి రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ తాజాగా తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఒకటేనా ఫేస్ బుక్ లో అత్యధిక మంది ఫాలో అవుతున్నటువంటి టాప్ 10 భారతీయ స్టార్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్ చేరిపోయాడు.

Telugu Bahubali, Indian, Prabhas, Prabhascreates, Rajamouli, Top Indian List, Yo

ఫేస్ బుక్ లో ప్రభాస్ 2.4 కోట్ల మంది ఫాలోవర్స్ తో 9వ స్థానంలో ఉండి రికార్డును సాధించారు.అయితే సౌత్ ఇండియా నుంచి ఈ విధమైనటువంటి రికార్డును అందుకున్న ఏకైక హీరో ప్రభాస్ కావడం విశేషం.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 5 కోట్ల మంది ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉండగా.ఆ తర్వాత అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అమితాబ్ వరుసగా ఉన్నారు.

ఏది ఏమైనా ప్రభాస్ సోషల్ మీడియాలో కూడా ఈ అరుదైన రికార్డు సాధించడం గమనార్హం.ప్రస్తుతం ప్రభాస్ “రాధేశ్యామ్”, “సలార్”, “ఆది పురుష్” వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube