'ఆదిపురుష్‌' షూటింగ్ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌

Pan India Star Prabhas Adipurush Movie Shooting Update

ప్రభాస్ నటిస్తున్న మొదటి హిందీ సినిమా ఆదిపురుష్‌. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

 Pan India Star Prabhas Adipurush Movie Shooting Update-TeluguStop.com

ఇటీవలే విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్ర షూటింగ్‌ ముగిసింది అంటూ అధికారికంగా ప్రకటించారు.ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే సైఫ్‌ అలీ ఖాన్‌ తో కేక్‌ కట్‌ చేయించి గుడ్‌ బై చెప్పేశారు.

ఇటీవలే కృతి సనన్ కూడా తన పోర్షన్ ను ముగించింది.దాంతో ఆమెతో కూడా కేక్ కట్‌ చేయించారు.

 Pan India Star Prabhas Adipurush Movie Shooting Update-ఆదిపురుష్‌’ షూటింగ్ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలు షూటింగ్‌ జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్‌ షూటింగ్ ను ఈనెల చివరి వరకు ముగించేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమా మొత్తం కూడా బ్లూ అండ్‌ గ్రీన్‌ మ్యాట్‌ పై చిత్రీకరిస్తున్నారు.కనుక చిత్రీకరణ కు ఎక్కువ సమయం పట్ట లేదు.

ఎక్కువ సెట్టింగ్ లు భారీ కాస్టింగ్ లేదు కనుక ఈ సినిమా పని ఈజీగా అయ్యిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

షూటింగ్‌ పార్ట్‌ ఎంత ఈజీగా అయ్యిందో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ అంతకు రెండింతలు మూడింతలు కష్టంగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా కు ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇండియాలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని వీఎఫ్‌ ఎక్స్ వర్క్ తో ఈ సినిమా హాలీవుడ్‌ రేంజ్ లో ఉంటుందట.

Telugu Adipurush, Adipurush, Bollywood, Om Raut, Krithy Sannan, Pan India, Prabhas, Saif Ali Khan, Vfx Work, Visual-Movie

సినిమా మొత్తం కూడా వీఎఫ్‌ఎక్స్ తో విజువల్ వండర్ అన్నట్లుగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి నెలలు గడుస్తుంది.కాని ఇప్పటి వరకు సినిమా లో ప్రభాస్‌ ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం రివీల్‌ చేయలేదు.ఇప్పటి వరకు అలాంటి పాత్రను ప్రభాస్ చేయలేదు.సినిమా చిత్రీకరణ కోసం ప్రభాస్‌ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు.ఆ షూటింగ్‌ ముగిస్తే సలార్‌ ను ముగించేందుకు సిద్దం అవ్వబోతున్నాడు.

#Krithy Sannan #Vfx #Prabhas #Om Raut #Adipurush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube