ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం.. చివరి తేదీ పొడిగించిన ప్రభుత్వం..

ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేయకపోతే ఎటువంటి సబ్సిడీ లభించదని పాన్ కార్డు తో బ్యాంకు ట్రాన్సాక్షన్ చేయలేరని పెన్షన్, స్కాలర్షిప్ వంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేరని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.2021 మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డు ని ఆధార్ తో లింకు చేసుకోవాలని ఒక గడువు కూడా పెట్టింది.అయితే ఇన్కమ్ టాక్స్ నిర్ణయించిన గడువు లోపు చాలామంది చెల్లింపుదారులు ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేసుకోలేకపోయారు.దీంతో తమకు కొంత సమయం ఇవ్వాలని పాన్ కార్డు వినియోగదారులు విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పాటు గడువు పెంచింది.

 Pan Card Link With Aadhaar Government Extends Last Date , Aadhar Card, Pan Card,-TeluguStop.com

అయితే మార్చి నెల నుంచి భారతదేశంలో కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా పడకూడదని ఆధార్ – పాన్ అనుసంధానం యొక్క గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల బోర్డు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం ఆధార్ – పాన్ కార్డు అనుసంధానం చేసే గడువును పొడిగించిందని ఇన్కమ్ టాక్స్ ఇండియా వెల్లడించింది.ఐతే 2020 ఆగస్టు నెల వరకు 32 కోట్ల 70 లక్షల పాన్ కార్డులు ఆధార్ తో అనుసంధానం అయ్యాయి.

Telugu Aadhar Pan, Adhar, Central, Extended, Tax India, June, Linked, Pan-Latest

అయితే తాజాగా పొడిగించిన నిర్ణీత గడువు అనగా జూన్ 30 లోపు ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం చేయకపోతే చెల్లింపుదారులు వెయ్యి రూపాయల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరూ త్వరగా ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ప్రయత్నించండి.నిజానికి పాన్ కార్డు అనుసంధానం ప్రాసెస్ రెండు నిమిషాల్లోనే పూర్తి చెయ్యొచ్చు.రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి UIDAIPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ ని టైప్ చేసి ఆపై స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ కార్డు నెంబర్ టైప్ చేయాలి.

అనంతరం 567678 లేదా 56161 నంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి.క్షణాల్లోనే మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube