52 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి... 12 రోజుల్లో విడాకులు! హీరోయిన్ వ్యవహారం

విదేశాలలో వివాహ వ్యవస్థ మీద ఎవరు పెద్దగా నమ్మకం పెట్టుకోరు.పెళ్లి చేసుకున్న కూడా ఒకరితో ఒకరికి సంబంధాలు చెడిపోతే ఏ మాత్రం ఆలోచించకుండా విడాకులు తీసుకుంటారు.

 Pamela Anderson Jon Peters Fifth-TeluguStop.com

మరో మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అవుతారు.దీంతో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ విదేశాలలో అస్తవ్యస్తంగా ఉంటుంది.

అలాగే అక్కడి వారి జీవితాలు కూడా ఎవరికీ వారు అన్నట్లు ఉంటాయి.ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఇలాంటి రిలేషన్స్, విడాకులు చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి.

అక్కడ ఉన్న హీరోయిన్స్ కి రెండు కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు అయిన వారు ఎక్కువ మంది ఉంటారు.

వారిలో పమేలా అండర్సన్ కూడా ఒకరు.

హాలీవుడ్ ప్రముఖ నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మనవళ్లు, మనవరాళ్లను ఎత్తుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకుంది.ఇప్పటికే నాలురిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న ఈ బామ్మ జనవరి 20న కాలిఫోర్నియాలోని ప్రముఖ నిర్మాత జాన్‌ పీటర్స్‌ను ఐదో పెళ్లి చేసుకుంది.

ఇద్దరికి ఇది ఐదో పెళ్లి కావడం విశేషం.అయితే ఈ సారైనా వీళ్ళు ఒకటిగా ఉంటారని భావించిన వారికి షాక్ ఇచ్చే విధంగా పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా గడవకముందే విడాకులు తీసుకున్నారు.

ఈ విషయంపై తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మాకు ఒకరి జీవితం నుంచి మరొకరికి ఏం కావాలో తెలీడం లేదు.అది తెలిసే వరకు విడిగా ఉండాలని అనుకున్నాం.

అందుకే పెళ్లి రద్దు చేసుకోవాలనే నిర్ణయించుకున్నాం’ అని క్లారిటీ ఇచ్చింది.మొత్తానికి 12 రోజుల్లో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం ద్వారా పమేలా మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube