మీకు తెలుసా : తాటి కల్లుతో హ్యాండ్‌ శానిటైజర్‌ తయారు చేస్తున్నారు

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి నుండి బయట పడాంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరే పరిష్కారం లేదు.కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ముందస్తు జాగ్రత్తలు విధిగా పాటిస్తూ ఉండాలంటూ అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

 Palm Wine, Sanitizer, Indenesia, Bali, Corona Effect, Hand Sanitizer-TeluguStop.com

అందులో భాగంగానే ప్రపంచంలోని పలు దేశాలు ఈ సమయంలో ఒకరిని ఒకరు కలువ వద్దనే ఉద్దేశ్యంతో లాక్‌ డౌన్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే.బయటకు వెళ్లిన ప్రతి సారి ఖచ్చితంగా హ్యాండ్‌ శానిటైజర్‌ను ఉపయోగించాల్సిందే అంటున్నారు.

హ్యాండ్‌ శానిటైజర్స్‌కు ప్రస్తుతం యమ డిమాండ్‌ పెరిగింది.భారీ ఎత్తున శానిటైజర్ల అవసరం ఉన్న నేపథ్యంలో వాటి తయారి సంస్థలు చేతులు ఎత్తేశాయి.డిమాండ్‌ ఉన్నదాంట్లో కనీసం సగం కూడా ఇవ్వలేక పోతున్నాయి.దాంతో కొత్త కొత్త శానిటైజర్లను తయారు చేస్తున్నారు.

కొందరు ఇంట్లోనే శానిటైజర్స్‌ను తయారు చేసుకుంటున్నారు.శానిటైజర్స్‌లో 90 శాతం ఆల్కహాల్‌ ఉంటే అది మంచిదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే ఇప్పుడు నకిలీ శానిటైజర్స్‌ కూడా వస్తున్నాయి.

ఈ సమయంలో ఇండోనేషియాలోని బాలిలో విచిత్రంగా తాటికల్లు అదేనండి వైట్‌ వాటర్‌తో శానిటైజర్స్‌ను తయారు చేస్తున్నారు.అక్కడ ప్రయోగాత్మకంగా చేపట్టగా అది కాస్త సక్సెస్‌ అయ్యింది.బాలి పోలీస్‌ చీఫ్‌ పీట్రస్‌కు ఈ ఆలోచన కలిగింది.

కల్లును తీసుకు వెళ్లి అక్కడ ఒక ప్రముఖ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలకు అందించి దీంతో శానిటైజర్స్‌ ఏమైనా తయారు చేయవచ్చా అనేది పరిశీలించమన్నారు.వారు ప్రయోగాలు నిర్వహించి వారం రోజుల్లో కల్లుతో హ్యాండ్‌ శానిటైజర్‌ను తయారు చేశారు.

వారు తయారు చేసిన శానిటైజర్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితులకు లోబడి వారు చెప్పిన ఆల్కహాల్‌ శాతంను కలిగి ఉంది.96 శాతం ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉండటంతో ఇతర శానిటైజర్స్‌ కంటే ఇది ఎక్కువగా పని చేస్తుందని వారు అంటున్నారు.అయితే చేతులకు ఇబ్బంది కలుగకుండా వాసన మార్చేందుకు గాను అందులో లవంగాలు ఇంకా పూదీన రసాలు కలిపారు.ఇప్పటి వరకు అక్కడ 10600 లీటర్ల శానిటైజర్‌ను కల్లుతో తయారు చేసినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఆ పద్దతిని ఇండియాలో కూడా మొదలు పెడితే బాగుంటుంది కదా…!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube