పల్లెటూరు బాట పట్టిన టాలీవుడ్‌!

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూరు అందాు కనిపించేవి.ఆ తర్వాత పరిస్థితి మారింది.

 Palletooru Bata Battina Tollywood-TeluguStop.com

ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ మరియు పట్టణాల్లో చిత్రీకరణ చేస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందనిపిస్తుంది.

తెలుగులో ఈమద్య కాలంలో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఎక్కువ శాతం పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కడం విశేషం.భారీ ఎత్తున బడ్జెట్‌ అవసరం లేదు, సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌తో కూడా మంచి లుక్‌తో పల్లెటూరు నేపథ్యంలో సినిమాలను తీర్చిదిద్దగలం.

అందుకే దర్శకులు పల్లెటూరు వైపుకు మొగ్గు చూపుతున్నారు.ఈమద్య వచ్చిన చిత్రాల్లో పల్లె అందాలను చక్కగా చూపించారు.

గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రంలో దర్శకుడు సతీష్‌ వేగేశ్న పల్లె అందాలను, అక్కడ అనుబంధాలను, స్నేహాలను చక్కగా చూపించి ఆకట్టుకున్నాడు.పల్లె అందాలతో రూపొందిన ఆ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు సైతం దక్కింది.ఆ చిత్రం శర్వానంద్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచింది.ఆ తర్వాత త్రివిక్రమ్‌ ‘అఆ’ చిత్రంతో పల్లె అందాలను చూపించాడు.సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక తాజాగా ‘రంగస్థలం’ చిత్రం మొత్తం కూడా పల్లెటూరులోనే కొనసాగింది.

అది కాకుండా 1980 కాలంలో పల్లెటూర్లు ఎలా ఉండేవి అనేది కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించి సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చి సూపర్‌ హిట్‌ అయిన పలు సినిమాలు పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కినవే అనే విషయం తెల్సిందే.

‘మురారి’, ‘చందమామ’, ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాలు పల్లెటూరు అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపించాయి.ఆ సినిమాల తర్వాత మళ్లీ దర్శకుడు కృష్ణవంశీ ఒక పూర్తి స్థాయి పల్లెటూరు వాతావరణంలో సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

పల్లె వాతావరణంను అందంగా, ఆకర్షనీయంగా తెరకెక్కించడంలో దర్శకుడు కృష్ణవంశీది పెద్ద చేయి, అందుకే ఈసారి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

ఇక నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎక్కువ శాతం పల్లెవాతావరణంలో తెరకెక్కిన ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు పాత్రతో సినిమాను చేసేందుకు నాగ్‌ ఆశపడుతున్నాడు.అది పూర్తిగా పల్లెటూరు వాతావరణంలో కనిపించబోతుంది.

ఇంకా పలు సినిమాలు కూడా పల్లె అందాలను చూపించబోతున్నాయి.

ఇలా టాలీవుడ్‌ అగ్ర దర్శకులు మరియు నిర్మాతలు వరుసగా పల్లెటూరు నేపథ్యంలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గతంలో పల్లెటూరు వ్యక్తి పాత్రను పోషించేందుకు ఆసక్తి చూపించని హీరోలు అలా నటించేందుకు ప్రస్తుతం అమితాశక్తిని చూపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube