రూ.500తో హైదరాబాద్ కు వచ్చాడు.. బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.. పల్లవి ప్రశాంత్ సక్సెస్ కు గ్రేట్ అనాల్సిందే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) పేరు మారుమ్రోగుతోంది.ఎన్నో అవమానాలను ఎదుర్కొని పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు.

 Pallavi Prashanth Great Inspirational Success Story Details Here Goes Viral In S-TeluguStop.com

యూట్యూబర్, ఫోక్ సాంగ్ క్రియేటర్ గా గుర్తింపును సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ ఎదురైన ఇబ్బందుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.గజ్వేల్( Gajwel ) మండలం కొల్గూరుకు చెందిన ప్రశాంత్ తండ్రి రైతు కాగా చిన్నప్పటి నుంచి ప్రశాంత్ కు కల్చరల్ యాక్టివిటీస్ పై ఆసక్తి ఉండేది.

ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టిన ప్రశాంత్ ఫోక్ సాంగ్స్ ద్వారా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు.యూట్యూబ్ ఛానల్ విషయంలో ఫ్రెండ్స్ మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

రైతుల సమస్యలను వీడియోలు తీసిన పల్లవి ప్రశాంత్ 500 రూపాయలతో హైదరాబాద్( Hyderabad ) కు వచ్చాడు.డబ్బులు లేక పల్లవి ప్రశాంత్ ఆకలితో అలమటించిన రోజులు సైతం ఉన్నాయి.

Telugu Bigg Boss, Gajwel, Hyderabad, Pushpa, Story, Tollywood-Movie

బిగ్ బాస్5, బిగ్ బాస్6 లో ఛాన్స్ కోసం పల్లవి ప్రశాంత్ ప్రయత్నించినా ఛాన్స్ దక్కలేద్.బిగ్ బాస్ షో ఫస్ట్ ఎపిసోడ్ లో శివాజీ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ప్రశాంత్ మొక్కతో వచ్చాడని కప్పుతో వెళతాడని చెప్పగా ఆయన మాటలే నిజమయ్యాయి.ఫినాలే ఎపిసోడ్ లో సైతం మొక్క ఉన్న ప్రదేశమే బెస్ట్ ప్లేస్ అని పల్లవి ప్రశాంత్ కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Bigg Boss, Gajwel, Hyderabad, Pushpa, Story, Tollywood-Movie

పుష్పలో బన్నీని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడే ప్రశాంత్ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది.ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకున్న పల్లవి ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.పల్లవి ప్రశాంత్ సక్సెస్ ఎంతోమందికి సంతోషాన్ని కలిగిస్తోంది.

పల్లవి ప్రశాంత్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube