ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఊహించని ట్విస్టులతో, ఎన్నో బావోద్వేగపూరిత ఎమోషన్స్ తో సాగింది.మొత్తానికి ఈ సీజన్ గ్రాండ్ గా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముగిసింది.
రైతుబిడ్డ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) బిగ్ బాస్ టైటిల్ ని గెలిచి చరిత్ర తిరగరాయగా, అమర్ దీప్( Amardeep ) రన్నర్ గా మిగిలాడు.ఇక మొదటి నుండి కచ్చితంగా విన్నర్ అవుతాడు అనుకున్న శివాజీ( Shivaji ) మూడవ స్థానం తోనే సరిపెట్టుకున్నాడు.
మొత్తానికి ఈ సీజన్ మొత్తం ఈ ముగ్గురి వల్లనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.కానీ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా అమర్ దీప్ పై చాలా తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది.
ఇంత నెగటివిటీ లో కూడా ఆయన టాప్ 2 స్థానం కి రావడం, పల్లవి ప్రశాంత్ తో సరిసమానమైన ఓటింగ్ రావడం వంటివి చూస్తే అమర్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి 13 వ వారం వరకు పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ మధ్య చాలా పెద్ద గొడవలు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.ముఖ్యంగా 14 వ వారం లో అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ చాలా పీక్ రేంజ్ అనే చెప్పాలి.అమర్ దీప్ అదుపు తప్పి ప్రశాంత్ ని మెడికల్ రూమ్ వరకు తోసుకుంటూ పోవడం ప్రశాంత్ ఫ్యాన్స్ కి( Prashanth Fans ) చాలా తీవ్రమైన ఆగ్రహం ని రప్పించింది.
కేవలం ప్రశాంత్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా ఏమైంది అమర్ కి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ప్రశాంత్ అంటే అంత చిన్న చూపు, చులకన భావం ఎందుకు అని అనుకున్నారు.నిన్న బిగ్ బాస్ స్టూడియో నుండి బయటకి వెళ్తున్న సమయం లో అమర్ దీప్ కార్ పై ( Amardeep Car ) దాడి చేసారు.

ఈ దాడి లో బ్యాక్ డోర్ గ్లాస్ బద్దలు అయ్యింది.అమర్ దీప్ భార్య తేజస్విని మరియు ఆయన తల్లి రూప ఆందోళలనకి గురి అయ్యారు.ఏది ఏమైనా ఒక రియాలిటీ షో లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని సదరు కంటెస్టెంట్ పై దాడి చెయ్యడం నీచమైన చర్య.అమర్ దీప్ కి ఫ్యాన్స్ తక్కువగా ఏమి లేరు, నాగార్జున కూడా స్వయంగా చెప్పాడు, ఇద్దరికీ దాదాపుగా సరిసమానమైన ఓటింగ్ వచ్చింది అని.ఒకవేళ అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా పల్లవి ప్రశాంత్ పై తిరగబడితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.అమర్ మరియు ప్రశాంత్ ఆ గొడవ తర్వాత మళ్ళీ కలిసిపోయారు.
అన్నదమ్ములు లాగ ఉంటున్నారు, అభిమానులు కూడా ఈ షో ని ఇంతటి మర్చిపోతే బెటర్ అని ఈ షో ని చూసే ఆడియన్స్ చెప్తున్నారు.







