అసురన్ కి ఎర్త్ పెడుతున్న పలాస!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వస్తున్నా చిన్న సినిమాలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.ఊహించని విధంగా కొత్త కథ, కథనాలు, ప్రెజెంటేషన్ తో ప్రేక్షకులలో రిలీజ్ కి ముందు నుంచి హైప్ క్రియేట్ చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.

 Palasa Movie Story Same As Asuran Remake-TeluguStop.com

కొన్ని సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.కొత్త వాళ్ళు అయిన దర్శకులు చూపిస్తున్న క్రియేటివిటీతో కొత్తదనం కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

అలా తాజాగా వస్తున్నా సినిమాలలో పలాస1978 సినిమా టాలీవుడ్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది.శ్రీకాకుళం జిల్లాలో పలాస పట్టణంలో జరిగిన కొన్ని యాదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ఆవిష్కరించారు.

రఘుకుంచె చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఈ సినిమాకి సంగీత అందించడంతో పటు నటుడుగా నెగిటివ్ రోల్ చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచింది.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా కంటెంట్ అసురన్ కి దగ్గర పోలికలు ఉన్నాయి.

ఇవి ఇప్పుడు వెంకటేష్ అసురన్ కి టెన్షన్ గా మారింది.అసురన్ కథ కూడా అగ్రవర్ణ, బలహీన వర్గాల మధ్య ఆధిపత్య పోరు నేపధ్యంలో ఉంటుంది.

ఇందులో వెంకటేష్ పాత్ర పందులు కాచుకునే నిమ్న జాతి వాడిగా ఉంటుంది.ఇక పలాసలో కూడా పలాస పట్టణంలో ఒక జమిందారు, ఆ ఊళ్ళో ఉండే ఓ తక్కువ జాతి యువకుడు మధ్య ఆధిపత్య పోరుగానే ఉంటుంది.

అయితే రెండు కథలలో రెండు వర్గాల వారి మధ్య జరిగే కోట్లటకి కారణం వేరుగా ఉంటుంది.ఆ ఒక్క పాయింట్ సినిమా నేపధ్యం తప్ప ఒరిజినల్ కథ ఒకేలా ఉంటాయని టాక్ వినిపిస్తుంది.

మరి ఈ రెండు సినిమాలు సురేష్ బాబు రిలీజ్ చేయబోతున్నాడు.మరి అసురన్ కథ, పలాస కథ ఒకేలా ఉన్న రెండు భిన్నమైన ప్రాంతాల నేపధ్యంలో ఉండటంతో ఎమోషనల్ కంటెంట్ కావడం వర్క్ అవుట్ అవుతాయని ముందుకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube