పలాస డైరెక్టర్‌కు బంపరాఫర్!  

Palasa Director Next Movie With Rajasekhar - Telugu Allu Aravind, Karuna Kumar, Palasa, Rajasekhar

టాలీవుడ్‌లో చిన్న సినిమాల్లో మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు.కాగా కొత్త కథతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు చిత్రంలో బోలెడన్నీ పెట్టినా కూడా కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రాక వారి ట్యాలెంట్‌ను నిరూపించుకోవడంలో వెనకబడిపోతున్నారు.

 Palasa Director Next Movie With Rajasekhar

ఇక రీసెంట్‌గా పలాస అనే సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా కరుణ కుమార్ తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు.

పూర్తి మాస్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తి సక్సెస్ కావడంతో కరుణ కుమార్‌కు అదిరిపోయే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

పలాస డైరెక్టర్‌కు బంపరాఫర్-Gossips-Telugu Tollywood Photo Image

ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కరుణ కుమార్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది.కాగా ఇప్పుడు మరో సీనియర్ హీరో రాజశేఖర్‌తో పలాస డైరెక్టర్ కరుణ కుమార్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

తాజాగా జీవితా రాజశేఖర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో, కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా రాజశేఖర్ కోసం ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను కరుణ కుమార్ తెరకెక్కించేందకు రెడీ అవుతున్నాడు.

జీవితా రాజశేఖర్‌కు ఈ సబ్జె్క్టు బాగా నచ్చడంతో ఈ సినిమాను వెంటనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి పలాస చిత్రంతో తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్న కరుణ కుమార్, ఈసారి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test