ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.గత కొన్ని శతాబ్దాలుగా సమాజంలో పింజర్లు, దూదేకులు అవహేళనకు గురి అవుతూ వస్తున్నారని ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ నేతలు తెలిపారు.
అలాంటి పదాలు వాడవద్దంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ జీవోతో మాకు సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక నుంచి ఇలాంటి పదాలను ఎవరైనా దూషణలకు వాడుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.సమాజంలో మాకు గౌరవం హోదా కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.175 లక్ష్యంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు.