పక్కా కమర్షియల్ మూవీ తొలి రోజు కలెక్షన్లు అన్ని కోట్ల రూపాయలా?

మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.కథ, కథనం విషయంలో మరింత జాగ్రత్తగా మారుతి వ్యవహరించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Pakka Commercial Movie First Day Collections Details Here Goes Viral ,  Collecti-TeluguStop.com

పక్కా కమర్షియల్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో మారుతి కెరీర్ లో హిట్ గా నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే తొలిరోజు ఈ సినిమా ఏకంగా 6.3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.ఈ సినిమాకు బుకింగ్స్ కొన్ని థియేటర్లలో బాగానే ఉన్నా మెజారిటీ థియేటర్లలో ఆశాజనకంగా లేవు.

టికెట్ రేట్లు తగ్గించినా ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం.గోపీచంద్ కెరీర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా పక్కా కమర్షియల్ సినిమా నిలిచింది.

గోపీచంద్ కు సక్సెస్ కీలకమైన సమయంలో పక్కా కమర్షియల్ సినిమా కూడా గోపీచంద్ కోరుకున్న సక్సెస్ ను అయితే అందించలేదని సమాచారం అందుతోంది.శనివారం, ఆదివారం రోజులలో ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం విషయంలో ఒక అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే.

పక్కా కమర్షియల్ రిజల్ట్ విషయంలో గోపీచంద్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Gopichand, Day, Daygopichands, Maruti, Pakka, Pakka Day, Rashi Khanna-Mov

సినిమాలో కామెడీ సీన్లు బాలేవని రాశిఖన్నా అభినయం చిరాకు తెప్పించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా లేదని ఈ సినిమా యావరేజ్ అని నెటిజన్లు చెబుతున్నారు.ఫస్టాఫ్ చాలా స్లోగా ఉందని మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్ అయిందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

పక్కా కమర్షియల్ సినిమాను మరింత బెటర్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేదని నెటిజన్లు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube