బోర్డర్ లోనే కాదు క్రికెట్ బోర్డ్ లో కూడా కొట్టుకుంటున్న దాయాదులు

భారత్, పాకిస్థాన్ మధ్య గత 70 ఏళ్ళ నుండి వైరం కొనసాగుతుంది.భారత్ సహృదయంతో ఎన్నిసార్లు పాకిస్థాన్ కు సహాయం చేసిన వాళ్ళు మాత్రం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.

 Bcci Vs Pcb Fight In Cricket, Pakisthan, India, Icc New Chairman, Bcci, Pcb, Eng-TeluguStop.com

సహనం కోల్పోయిన భారత్ గత పదేళ్ల నుండి పాకిస్తాన్ ఉగ్రవాదులపై వాళ్లకు సంబంధించిన మూలాలపై ఉక్కు పాదం మోపుతున్నారు.దీనితో పాకిస్తాన్ మన మీద పడి ఏడవడం ఎక్కువైపోయింది.

తాజాగా అందులో భాగంగా ఐసీసీ కొత్త చైర్మన్ ప్రక్రియ ఎన్నిక కోసం ఐసీసీ సభ్యులందరితో వర్చువల్ మీటింగ్ నిర్వహించింది.ఈ మీటింగ్ లో భారత్ పాకిస్తాన్ ల మధ్య విబేధాలు గుప్పుమన్నాయి.

వివరాలలోకి వెళ్తే.

ఐసీసీలో 17 ఓట్లున్నాయి.

మూడింట రెండొంతుల మెజార్టీ ప్రకారం ఎన్నిక జరగాప్లని తాత్కాలిక చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, స్వతంత్ర డైరెక్టర్‌ ఇంద్రా నూయి, పీసీబీ, ముగ్గురు అసోసియేటెడ్‌ సభ్యులు పట్టుబట్టారు.దీన్ని భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సహా మరో ఏడు సభ్యదేశాలు తప్పుబట్టాయి.

అంతేకాకుండా ఎప్పటిలాగే కొత్త చైర్మన్ ప్రక్రియ కోసం సాధారణ మెజార్టీ ప్రక్రియను ఫాలో అవ్వాలని కోరాయి.ఈ అంశంపై ఎంతసేపు చర్చ జరిగినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బోర్డ్ తీర్మానం చేయవల్సిన పరిస్థితి ఏర్పడిందని బోర్డ్ సభ్యుడు అభిప్రాయపడ్డారు .

ఒకవేళ బోర్డ్ తీర్మానం చేస్తే భారత్ మిగతా సభ్యదేశాలు కోరుకున్నట్లు కొత్త చైర్మన్ ప్రక్రియ కోసం సాధారణ మెజార్టీ ప్రక్రియను ఫాలో అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.బోర్డర్ లోనే కాక ఇలా ప్రతి విషయంలో పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube