క్రికెటర్ ఉమర్ అక్మల్‎కు ఊరట..!

పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‎కు ఊరట లభించింది.అతడిపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని సగానికి కుదిస్తూ ఇండిపెండెంట్ జడ్జి, పాకిస్తాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఖోఖర్ తీర్పు వెల్లడించారు.

 Pakisthan Cricketer, Umar Akmal, Suspension, Independent Judge,-TeluguStop.com

రెండు వేర్వేరు సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారంటూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జస్టిస్ ఫజల్-ఇ-మిరాన్ చౌహాన్ ఈ ఏడాది ఏప్రిల్ 27న వికెట్ కీపర్ ఉమర్ అక్మల్‎పై మూడేళ్ల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.

దీంతో తన తప్పును క్షమించాలని, శిక్షను తగ్గించాలంటూ అక్మల్ మే 19న అప్పీల్ దాఖలు చేశాడు.

ఈ అప్పీల్ పై విచారించిన ఇండిపెండెంట్ జడ్జి అక్మల్ పై విధించిన మూడేళ్ల నిషేధ శిక్షను సగానికి తగ్గించి ఏడాదిన్నరకు కుదించారు.దీంతో అక్మల్ పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు వరకు నిషేధం కొనసాగనుందని న్యాయ నిర్ణేత తెలిపారు.

అయితే, ఈ తీర్పుపై తాను సంతృప్తిగా లేనని.ఈ నిషేధ శిక్షను మరింత తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తానని ఉమర్ అక్మల్ తెలిపాడు.తన లాయర్ వాదనలు విన్నందుకు న్యాయమూర్తికి ధన్యవాదాలు అని ఉమర్ అక్మల్ పేర్కొన్నాడు.తన కంటే ముందు ఎందరో ఆటగాళ్లు తప్పులు చేశారు.

వారందరికీ చిన్న శిక్ష వేసి తనకు మాత్రం పెద్ద శిక్ష వేశారని అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube