సీరియస్ గా చర్చ జరుగుతుండగా విరిగిన కుర్చీ,కిందపడ్డ విశ్లేషకుడు  

Pakistani Analyst Falls Of Chair-pakistani,tv Channels Debate

సీరియస్ గా టీవీ ఛానెల్ లో డిబేట్ జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఈ కార్యక్రమానికి వచ్చిన విశ్లేషకుడు కిందపడడం జరిగింది.అంతే అదంతా లైవ్ కావడం తో ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు గొల్లున నవ్వుకున్నారు.

Pakistani Analyst Falls Of Chair-pakistani,tv Channels Debate-Pakistani Analyst Falls Of Chair-Pakistani Tv Channels Debate

ఈ ఘటన పాకిస్థాన్ లోని జీటీవీ ఛానల్ స్థూడియో లో చోటుచేసుకుంది.ఇటీవల కాశ్మీర్ లో చోటుచేసుకున్న అంశాలపై సెప్టెంబరు 16న చర్చ నిర్వహించింది.అయితే టీవీలో జరిగిన చర్చకు మజార్ బర్లాస్ అనే విశ్లేషకుడు హాజరయ్యాడు.వాడీ వేడీగా చర్చ సాగుతుండగా మజార్ కూర్చీ విరిగిపోవడం తో కిందపడిపోయాడు.

Pakistani Analyst Falls Of Chair-pakistani,tv Channels Debate-Pakistani Analyst Falls Of Chair-Pakistani Tv Channels Debate

అన్నింటి కంటే చిత్రమైన విషయం ఏమిటంటే మజార్ కింద పడిపోతున్నా యాంకర్, మరో మహిళ విశ్లేషకురాలు పట్టీపట్టనట్లు వ్యవహరించడం విశేషం.చివరికి అలాంటి సమయంలో బ్రేక్ చెప్పాలన్న విషయం కూడా మరచి మరీ న్యూస్ రీడర్ నాలుక కరుచుకున్నాడు.అయితే ఇదంతా కూడా లైవ్‌లో నేరుగా ప్రసారమైంది.దీంతో నెటిజనులు ఆ క్లిప్‌ను రికార్డు చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అయితే సరిగ్గా కాశ్మీర్ అంశంపై చర్చలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం భారత నెటిజనులు ఆ పాక్ చానెల్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు.ఆ వీడియోను షేర్ చేసుకుంటూ ట్రోల్ చేస్తూ రకరకాలుగా ట్వీట్స్ చేస్తూ ఆటపట్టిస్తున్నారు.