15 సెకండ్ల వీడియో కోసం అడవిని తగలబెట్టింది.. టిక్ టాక్ స్టార్ పై భారీ ట్రోల్!

గత కొంత కాలం నుండి సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరికి బాగా పాకింది అనే చెప్పవచ్చు.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.

 Pakistani Tiktoker Humeira Asghar Trolled For Setting Fire To Trees For A Video-TeluguStop.com

ముఖ్యంగా సామాన్యులు మాత్రం తాము కూడా సెలబ్రెటీలు కావాలి అని సోషల్ మీడియా ద్వారానే తమ టాలెంట్ ను బయట పెడుతున్నారు.

గతంలో టిక్ టాక్ అనే రీల్ ఆప్ ఉండేది.

ఇందులో ఎంతో మంది సోషల్ వినియోగదారులు ఖాతా సృష్టించుకొని వీడియోలు చేసే వాళ్ళు.కొందరు మంచి వీడియోలు చేస్తే.

మరికొందరు చెత్త వీడియోలతో ముందుకు వచ్చేవారు.ఇక ఈ ఆప్ ను మనదేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి ఈ యాప్ బ్యాన్ కాకముందు ఇందులో లైకుల కోసం, వ్యూస్ కోసం ఏదైనా చేసే వాళ్ళు.చాలా వరకు నెగిటివ్ వీడియోలు కూడా చేసేవాళ్ళు.మరికొందరు తమ్ముడు చేసే వీడియోలతో బాగా దిగజారినట్లు కనిపించేవారు.చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాటిని పట్టించుకోకుండా తెగ వీడియోలు చేస్తూ ఉంటారు.

ఏదైనా ప్రమాదం జరిగే చోట కూడా సరదాగా వీడియోలు తీస్తూ పెడుతుంటారు.

ఎందుకంటే లైకుల కోసం అనే చెప్పాలి.దీంతో కొందరు సెలబ్రెటీలు అవుతే మరికొందరు దారుణమైన కామెంట్లు ఎదుర్కొనే వారు.అలా ఇప్పటికీ చాలామంది టిక్ టాక్ వినియోగదారులు చాలా దారుణమైన వీడియోలు చేసి నెగటివ్ ను మూటగట్టుకున్నారు.

అలా తాజాగా మరో వినియోగదారి కూడా నెగటివ్ ను మూటగట్టుకుంది.

తాజాగా ఆమె చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆమె చేసిన వీడియోను చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.

పాకిస్తాన్ సోషల్ మీడియా స్టార్ హ్యుమైరా అస్గర్‌.ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

పైగా తన టిక్ టాక్ వీడియోతో బాగా హల్ చల్ చేస్తుంది.

లైక్ ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన టిక్ టాక్ వీడియోను చూసి నెటిజన్లు బాగా ఆగ్రహం చూపిస్తున్నారు.ఇంతకీ అదేంటంటే తగలబడుతున్న చెట్ల ముందు తను అందంగా తయారయ్యి సుకుమారంగా నడుచుకుంటూ వీడియో కి పోజిచ్చింది.

అంతే కాకుండా తను ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఫైరే అన్ని కాప్షన్ కూడా ఇచ్చింది.

ఇక ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో హడావుడి చేస్తోంది.

దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు నానా రకాల కామెంట్లు పెడుతున్నారు.పిచ్చి దానివా.

నీ 15 సెకన్ ల విడియో కోసం అడవిని తగులబెడుతావా. నీ పై కేసు పెట్టాలి అని రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

దాంతో దీనికి స్పందించిన ఆమె.తాను చెట్లకు ఎటువంటి హాని తలపెట్టలేదు అని చెప్పుకొచ్చింది.అయినా కూడా నెటిజన్లు చల్లారక.ఒకవేళ నువ్వు నిప్పు పెట్టకపోయినా అక్కడ తగలబడుతుంటే వీడియో తీసే బదులు నీళ్లు పోసి చల్లారచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube