పాకిస్థానీ 'మోడల్'పై ఆ మతస్థులు ఆగ్రహం.. కారణం అదే!

Pakistani Model Apolog Ises After Her Barehead Photoshoot At Kartarpur Sahib

సిక్కు మతస్తులు వారి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, వారి మతాన్ని ఎంత గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకవేళ ఎవరైనా వారి ఆచారాలను పాటించకపోయిన, అలాగే అగౌరవపరిచిన వారు అసలు ఊరుకోరు.

 Pakistani Model Apolog Ises After Her Barehead Photoshoot At Kartarpur Sahib-TeluguStop.com

ఇటీవలే ఒక పాకిస్థాన్ మోడల్ తమ మతాన్ని కించపరిచింది అంటూ ఆ దేశ సిక్కులూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మోడల్ సౌలేహా ఒట్టి.

పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌లో మోడల్‌ సౌలేహ ఒట్టి తన తలకు చున్నీ కూడా లేకుండా ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకుంది.ఈ ఫోటో కాస్త వైరల్ అవడంతో ఆ ఫోటోని సిక్కు మతస్తులు చూశారు.

 Pakistani Model Apolog Ises After Her Barehead Photoshoot At Kartarpur Sahib-పాకిస్థానీ మోడల్’పై ఆ మతస్థులు ఆగ్రహం.. కారణం అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ ఫోటో తమ మనోభావాలు దెబ్బ తీసింది అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ మత స్థలంలో కూడా ఇలాగే  చేసేంత ధైర్యం ఉందా? కర్తార్ పూర్ సాహిబ్ ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకుందా అంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అంతేకాకుండా ఆమె పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అంటూ సిక్కు మతస్తులు డిమాండ్ చేశారు.దీంతో ఆమె ఆ ఫోటోలు డిలీట్ చేస్తూ నేను సిక్కుల చరిత్రను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళానే తప్ప, ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోలేదు.

అలాగే మీ సంస్కృతిని అగౌరవపరిచినందుకు ఈ చర్యలకు దూరంగా ఉంటాను అంటూ ఆమె క్షమాపణలు కోరింది.ఇలా ఈమె సిక్కుల మతస్తులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.

#Gurudwara #Pakistan #Kartarpur Sahib #Gurudwara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube