లెజండ్స్ ఇలానే ఉంటారంటున్న పాక్ క్రికెటర్ భార్య...!

సందర్భం ఏదైనా సరే, స్థలం ఎక్కడైనా సరే ఎవరైనా బాగా శ్రమిస్తూ ఓ పక్కన కూర్చుంటే వద్దనుకున్న ఆవలింపు రావడం సహజ ప్రక్రియ.ఇక అసలు విషయంలోకి వెళితే… గత సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు కీపింగ్ అందిస్తున్న ఆటగాడు సర్ఫరాజ్ అహ్మద్ ఆవలించిన సంగతి అందరికీ తెలిసిందే.

 Pakistani Cricketer Sarfaraz Ahmeds Wife Steve Smith Yawning Photo-TeluguStop.com

అయితే అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిన సంగతి కూడా తెలిసిందే.పెద్ద ఎత్తున ఆ ఫోటో ను, వీడియోను ప్రపంచం మొత్తం క్రికెట్ అభిమానులు ట్రోల్ చేశారు.

అయితే ఆ తర్వాత ఫాం లో లేని కారణంగా తన కెప్టెన్సీ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది సర్పరాజ్ అహ్మద్.ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టి20 సిరీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా ఆవలించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.మ్యాచ్ సాఫీగా జరుగుతున్న సమయంలో అప్పటికే అవుట్ అయి స్టాండ్స్ లోకి వచ్చిన స్మిత్ కుర్చీలో కూర్చుని ఒక ఆవలింపు ఇచ్చాడు.

అయితే ఇందుకు సంబంధించిన ఫోటోను తాజాగా పాకిస్థాన్ ఆటగాడు సర్ఫరాజ్ అహ్మద్ భార్య ట్వీట్ చేస్తూ లెజండ్స్ ఆటగాళ్లు ఇలానే ఉంటారని తెలియజేసింది.దీంతో తన భర్త లెజండ్ అని చెప్పకనే చెప్పింది.

ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇకపోతే తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube