మరో హీరోయిన్ కి కరోనా పాజిటివ్... దాంతో....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కొంతమేర ప్రభుత్వ నిబంధనలు మరియు వైద్యుల సలహాలు పాటించడంతో  కరోనా ఉద్ధృతి తగ్గినప్పటికీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ముప్పు తప్పడం లేదు.

 Pakistani Actress Mahira Khan Got Corona Positive, Mahira Khan, Pakistani Actres-TeluguStop.com

తాజాగా పలు బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన ప్రముఖ పాకిస్తానీ నటి “మహీరా ఖాన్” కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇందులో భాగంగా తనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఇటీవలే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఇందులో తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అలాగే గత కొద్ది రోజులుగా తనని సంప్రదించినవారు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

 అంతేగాక తాను కూడా హోమ్ క్వారెంటైన్ కి వెళుతున్నట్లు తెలిపింది. దీంతో కొందరు  మహీరా ఖాన్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ తొందరగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మరికొంతమంది మాత్రం హోమ్ క్వారంటైన్ లో ఉన్న సమయంలో క్రమం తప్పకుండా వైద్యుల సలహాలు మరియు సూచనలను పాటిస్తే కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవచ్చని ధైర్యం చెబుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహీరా ఖాన్ బాలీవుడ్లో “ద లెజెండ్ ఆఫ్ మౌలా జట్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube