ఇంగ్లాండ్ జట్టు షాక్ ఇచ్చిన పాక్.... పద్నాలుగు పరుగుల తేడాతో తోలి విజయం  

Pakistan Won The Match Against England In World Cup-

ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతుంది.గత నెల 30 వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రపంచ కప్ లో ప్రపంచ దేశాలు పాలు పంచుకున్నాయి.మొన్న బంగ్లా జట్టు సౌతాఫ్రికా పై గెలిచి షాక్ ఇవ్వగా,ఇప్పుడు పాక్ ఇంగ్లాండ్ జట్టు పై గెలిచి వరల్డ్ కప్ లో ఆ జట్టు తోలి విజయాన్ని నమోదు చేసుకుంది...

Pakistan Won The Match Against England In World Cup--Pakistan Won The Match Against England In World Cup-

ప్రపంచ కప్ లో ఫేవరేట్ గా దిగిన జట్టు ఇంగ్లాండ్ పై పాక్ సునాయాసంగా విజయాన్ని అందుకోవడం విశేషం.తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్ జట్టు 348 పరుగులు చేసింది.పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ అయిన మహ్మద్ హఫీజ్ 84, బాబర్ ఆజమ్ 63, సర్ఫరాజ్ అహ్మద్ 55 పరుగులతో రాణించడం తో పాక్ ఇంగ్లాండ్ ముందు 349 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది.అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది.

Pakistan Won The Match Against England In World Cup--Pakistan Won The Match Against England In World Cup-

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో రూట్ 107, జోస్ బట్లర్ 103 తో రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్ మెన్స్ సహకారం అందకపోవడం తో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు ఏమాత్రం తన ఆట తో ఆకట్టుకోలేకపోవడం తో ఆ జట్టు పై అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి.కానీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు అటు బౌలింగ్ లోనూ,బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించడం తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పాక్ ప్రపంచకప్ లో తన తోలి విజయాన్ని నమోదు చేసుకుంది.