తెలుగు వ్యక్తిపై అభిమానం చూపిన పాకిస్థాన్..ఏకంగా ఆయన పేరుతో...

మన దేశానికి పాకిస్థాన్ కు మధ్య పచ్చ గడ్డి లేకుండానే బగ్గుమంటుంది.భారత్ ను దొంగ దెబ్బ తీయాలని పాక్ ఎలాంటి కుట్రలు పన్నినా ఎప్పటికప్పుడు భారత్ వాటిని సమర్ధవంతగా తిప్పి కొడుతూనే ఉంటుంది.

 Pakistan, Which Is Fond Of A Telugu Man , Punnayapur, India, New Times Magazine,-TeluguStop.com

ఎప్పుడు అదును దొరుకుతుందా భరత్ పై కక్ష తీర్చుకోవాలని మన శత్రు దేశాలతో సైతం చేతులు కలుపుతూ కుయుక్తులు పన్నుతూనే ఉంటుంది.ప్రతీ రోజు పాక్ లో హిందువులపై దాడులు జరుగుతున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉంటున్నాం.

అయితే పాక్ లో ఓ తెలుగు వ్యక్తిని ఓ ప్రాంత ప్రజలు గౌరవించుకుంటున్న ఘటన వింటే మాత్రం అబ్బా అందరం అలా కలిసి మెలిసి ఉంటే ఎంతో బాగుటుంది కదా అనిపిస్తుంది.

పున్నయ్య పూర్.

కరాచీలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు.పున్నయ్య అంటే అక్కడ ప్రజలకు ఎంతో అభిమానం.

ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా ఓ బస్తీ కి ఆయన పేరును పెట్టారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయనపై వారికి ఏస్థాయిలో అభిమానం ఉందనేది.ఇంతకీ ఎవరీ పున్నయ్య.

ఏపీ లోని బాపట్లకు చెందిన వ్యక్తి కోటం రాజు పున్నయ్య.బాపట్లలో విద్యను అభ్యసించిన ఆయనకు పాత్రికేయ రంగంలో పనిచేయడం అంటే ఎంతో ఇష్టం.

ఈ ఇష్టమే.

బొంబాయి వరకూ వెళ్ళేలా చేసింది.

బొంబాయి వెళ్లి అక్కడ కొంత కాలం చదువుకున్న పున్నయ్య డిగ్రీ పట్టా సాధించాక పోయిన ఇంగ్లీష్ లో మాత్రం పట్టు సాధించారు.తరువాత ఆంధ్ర పత్రికలో చేరి మద్రాస్ వెళ్ళారు.

తరువాత ఆయనే ఓ పత్రికను స్థాపించి నడిపించారు.ఈ క్రమంలోనే హ్యుమానిటీ అనే ఇంగ్లీష్ పత్రికకు ఎడిటర్ అయ్యారు.

పత్రికా రంగంలో అంచలంచెలుగా గా ఎదుగుతున్న పున్నయ్య పై కరాచి కి చెందిన న్యూ టైమ్స్ పత్రిక యజమానుల దృష్టి పడింది.వారి కోరిక మేరకు కరాచి వెళ్లి అక్కడ న్యూ టైమ్స్ కు ఎడిటర్ గా పనిచేశారు.

ఆ తరువాత పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు గొంతుకగా మారిన ఆయన సింధు అనే పత్రికకు మారారు.పేదల వాణి వినిపిస్తూనే పోరాటం సాగించారు.

చివరకు ఈ పోరాటంలోనే తుది శ్వాస విడిచారు.దేశం కాని దేశం, పుట్టిన ఊరు కాకపోయినా తమకోసం ప్రాణాలు పళంగా పెట్టిన పున్నయ్య గౌరవార్ధం కరాచీలో ఓ వీధికి పున్నయ్య పూర్ గా నామకరణం చేసి తమ అభిమానాన్ని చాటారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube