పాక్‌లో హిందూ ఆలయ పునరుద్ధరణ

పాక్‌లో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడమంటే కచ్చితంగా చెప్పుకోదగ్గ వార్తే.అది కూడా ప్రభుత్వ నిర్ణయం కాదు.అక్కడి సుప్రీం కోర్టు నిర్ణయం ఇది.‘నాశనం చేసిన హిందూ ఆలయాన్ని పునరుద్ధరించండి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇదీ విశేషం.పాక్‌లోని కరక్‌ జిల్లాలో ఓ సాధువు పేరుతో నిర్మించిన హిందూ ఆలయాన్ని పందొమ్మిది వందల డెబ్బయ్‌ఏడులో కూల్చేసి కబ్జా చేశారు.ఈ ఆలయాన్ని పురుద్ధరించాలని కోరుతూ పాకిస్తాన్‌ హిందూ కౌన్సిల్‌కు చెందిన డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ వాంక్వానీ కోర్టులో కేసు వేశారు.కొన్నాళ్లు కేసు నడిచాక ఆలయం కూల్చివేతను సుప్రీం కోర్టు తప్పుగా భావించింది.

 Pakistan Sc Orders Govt To Get Temple Restored-TeluguStop.com

దాన్ని తిరిగి నిర్మించాలని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా (స్థానిక ప్రభుత్వం) ను ఆదేశించింది.శ్రీ పరమహంసజీ మహరాజ్‌ అనే సాధువు పేరుతో నిర్మించిన ఈ ఆలయాన్ని కొందరు కూల్చేశారు.

స్థలాన్ని కబ్జా కూడా చేశారు.పాక్‌లో అనేక హిందూ ఆలయాలను కూల్చేసి కబ్జా చేశారని అక్కడి హిందువుల గగ్గోలు పెడుతున్నారు.

కొన్ని ఆలయాలను కూల్చి మసీదులు కట్టారు కూడా.పాక్‌ పాలకులకు హిందువుల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదుగాని సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం విశేషం.

పాక్‌లో హిందువులు మైనారిటీలు.మైనారిటీల హక్కులు పరిరక్షించడం సర్కారు బాధ్యత.

దాన్ని విస్మరిస్తే న్యాయస్థానాలైనా న్యాయం చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube