తమపై మారో సారి దాడికి భారత్ ప్రయత్నం! పాకిస్తాన్ సంచలన ఆరోపణ  

తమపై భారత్ మరో సారి దాడికి ప్రయత్నం చేస్తుంది అంటున్న పాకిస్తాన్. .

Pakistan Says India Plan To Again Attack On My Country-airstrike,bjp,india,modi,pakistan,pulwama Attach

ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు పుల్వామా ఉగ్రదాడి, అనంతరం పాకిస్తాన్ లో ఉగ్రస్తావరాలపై వైమానిక దాడి లాంటి ఘటనలు కొంత వరకు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎన్నికలలో భాగా ఉపయోగ పడే అంశాలు. ఈ సంఘటనతో మోడీ పరిపాలన మీద ప్రజలకి విశ్వాసం పెరిగిపోయింది. దాంతో పాటు మిషన్ శక్తి ప్రాజెక్ట్ కూడా మోడీకి భాగా ఉపయోగపడింది..

తమపై మారో సారి దాడికి భారత్ ప్రయత్నం! పాకిస్తాన్ సంచలన ఆరోపణ-Pakistan Says India Plan To Again Attack On My Country

దీంతో విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సైనికుల చర్యలని, అలాగే వారి చావులని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అని విమర్శలు చేసారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మోడీపై మన ఇండియాలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపనలే పాకిస్తాన్ చేయడం మొదలెట్టింది. తమ దేశంపై భారత్‌ మరోసారి దాడులకు పాల్పడాలని చూస్తోందని ఆరోపించింది.

ఈనెల 16-20 తేదీల మధ్య తమ దేశంపై భారత్‌ దాడులు చేసేందుకు ప్రణాళిక రచిస్తోందని పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది. పాక్‌ తన వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడానికి ఉగ్రవాదులను భారత్‌ పైకి ఉసిగొల్పడమే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.