మరో సారి చాంద్ నవాబ్ రిపోర్టింగ్ వైరల్.. ఈ సారి ఏకంగా ఒంటెపై ఎక్కి..

న్యూస్ రిపోర్టింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది.లైవ్ రిపోర్టింగ్ ఇచ్చే టైంలో చాలా మంది రిపోర్టర్ ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంటారు.

 Pakistan Reporter Chand Nawab Reporting On The Camel Details, Camel, Reporting,-TeluguStop.com

అలా ఓ సారి ఇబ్బందులు ఎదుర్కొన్న పాకిస్థాన్ జర్నలిస్ట్ చాంద్ నవాబ్ మరో సారి రిపోర్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.చాంద్ నవాబ్.

ఈ పేరు గుర్తుందా.? గతంలో కరాచీలో ప్రజలు జరుపుకుంటున్న ఈద్ పండుగ‌పై రిపోర్టింగ్ చేసి చాలా వైరల్ అయ్యాడు.చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి వైరల్ అవుతున్నాడు.ఈ సారి ఒంటెపై కూర్చొని ఆయన రిపోర్టింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ సారి కరాచీలోని వెదర్ చేంజ్ గురించి ఆయన రిపోర్ట్ ఇచ్చారు.కరాచీలో వాతావరణం చాలా మారిపోయిందని, ఈదురుగాలులు వీస్తున్నాయని, దుమ్ము పైకి లేస్తోందని ఆయన రిపోర్టింగ్ చేశాడు.

ఓ మైదానంలో నిలబడి గాలి వీస్తున్న తీవ్రతను వివరించారు.సన్నగా, బలహీనంగా ఉన్నటు వంటి వారు ఇవాళ తీరానికి వెళ్లొద్దని.

వెళ్తే వారు ఇసుకతో కలిసి ఎగిరిపోతారని కాస్త ఫన్నీగా మాట్లాడారు.ఇక మరోచోట ఏకంగా ఒంటెపైన ఎక్కి ఆయన రిపోర్టింగ్ చేశారు.

ఇలాంటి వాతావరణం తరచుగా రాదని, ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఈ స్పెషల్ వెదర్‌ను ఎంజాయ్ చేయాలని కోరారు.ఈ వీడియోను జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్విట్టర్ వేదికగా ఈ నెల 22న షేర్ చేశాడు.ఈ వీడియోను చూస్తున్న నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఆయన 2009లో కరాచీ రైల్వే స్టేషన్ వద్ద ఈద్ పండుగ గురించి వివరిస్తూ రిపోర్టింగ్ చేస్తున్న టైంలో ప్యాసింజర్ అడ్గుగా వచ్చి చాలా డిస్టర్బ్ చేశారు.

దీంతో ఆయన మళ్లీ మళ్లీ టేక్ చేశారు.ఈ వీడియో అప్పట్లో చాలా వైరల్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube