ఓటమిని ఒప్పుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  

Pakistan President Imrankhan Says We Are Loosers In Article 370 Isuue-india Vs Pakistan,jammu And Kashmir

కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ చేస్తున్న ఇష్యూ ఆ దేశం పరువునే తీసింది.ఇండియాలో భాగం అయిన కశ్మీర్‌లోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడంపై పాకిస్తాన్‌ తెగ ఫైర్‌ అయ్యింది.అలా ఎలా చేస్తారు, అలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై లబో దిబోమంది.కాని ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్‌ మాటను సమర్దించలేదు.అమెరికా వంటి పెద్దన్న దేశం కూడా భారత్‌ అంతర్గత విషయం అంటూ కశ్మీర్‌ విషయం గురించి పెద్దగా ఆలోచించనక్కర్లేదు అంటూ పాకిస్థాన్‌కే గడ్డి పెట్టడం జరిగింది.

Pakistan President Imrankhan Says We Are Loosers In Article 370 Isuue-india Vs Pakistan,jammu And Kashmir-Pakistan President Imrankhan Says We Are Loosers In Article 370 Isuue-India Vs Jammu And Kashmir

అయినా కూడా తమకు ఐఖ్యరాజ్య సమితిలో ఇన్ని దేశాలు మద్దతు పలికాయి, అంతమంది భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు అంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పాడు.కాని ఇప్పుడు మాత్రం రష్యా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ విషయంలో తాము లేవనెత్తిన విషయమై మద్దతు ఇచ్చేందుకు తమకు ఒక్క దేశం కూడా సహకరించలేదు.

Pakistan President Imrankhan Says We Are Loosers In Article 370 Isuue-india Vs Pakistan,jammu And Kashmir-Pakistan President Imrankhan Says We Are Loosers In Article 370 Isuue-India Vs Jammu And Kashmir

కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంను ఏ ఒక్క దేశం తప్పుబట్టలేదు.ఆ విషయంలో తాము దౌత్యపరంగా విఫలం అయ్యామని సదరు ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

ఈ సమయంలో కూడా ఆయన ఇండియాపై కుళ్లు కనబర్చాడు.ఇతర దేశాలకు ఇండియాతో ఉన్న వాణిజ్య సంబంధాల కారణంగానే మాకు మద్దతుగా నిలవలేదు అంటూ పిచ్చి కూతలు కూశాడు.ఇప్పటికైనా విషయం అర్థం చేసుకుని ఇండియాతో జాగ్రత్తగా ఉండాలని పాకిస్తాన్‌ను విమర్శిస్తున్నారు నెటిజన్స్‌.