భారత్​ పై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ వ్యాఖ్యలు.. !!

భారత్, పాకిస్దాన్ మధ్య ఉన్న వివాదాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే.ఇప్పటికే భారత్ లో, పాక్ సృష్టించిన విధ్వంసం ఎన్ని యుగాలు గడిచిన మరపురాదు.

 Pakistan Pm Imran Khan Comments On India Pakistan, Pm Imran Khan, Comments, I-TeluguStop.com

అలాంటి పాకిస్దాన్, భారత్‌తో స్నేహాన్ని కోరుకోవడం అంటే ఎవరి ఊహకు అందని విషయం.

కానీ తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నమ్మలేని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

భారత్, పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని వేదాలు వళ్లిస్తున్నాడు.ఇకపోతే తాను అధికారంలోకి రాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయం మాట్లాడానని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పానని అన్నారు.

అయితే, ఆ విషయంలో తాను విఫలమయ్యానని, ఎప్పటికైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే శ్రీలంక పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సతో కలిసి సమావేశంలో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారట.

ఇకపోతే ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన మన విదేశాంగ శాఖ, ఉగ్రవాద నిర్మూలన, యుద్ధ వాతావరణం, హింస లేకుండా చూసినప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube