అగ్ర దేశాలు అయిన అమెరికా, చైనా నుంచి తమకి మద్దతు వస్తుందని ఆశించిన పాకిస్థాన్ కి ఊహించని విధంగా ఆ రెండు దేశాలు షాక్ ఇచ్చాయి.తక్షణం భారత్ పై కవ్వింపు చర్యలు ఆపేసి దేశంలో వున్న ఉగ్రవాదులని నిర్మూలించే ప్రయత్నం మొదలెట్టాలని గట్టిగా హెచ్చరికలు పంపించాయి.
ఈ దెబ్బతో పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ ఓ వైపు భారత్ ని రెచ్చగొడుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తూనే, మరో వైపు యుద్ధంతో సమస్య పరిష్కారం కాదని, శాంతి చర్చలతో దేనికైనా పరిష్కారం దొరుకుతుంది అంటూ శాంతి వచనాలు పలుకుతుంది.
అయితే పాకిస్థాన్ స్వభావం తెలిసిన భారత్ రక్షణ దళాలు మాత్రం వారికి ఎ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ కవ్వింపు చర్యలని తిప్పి కొడుతుంది.
వారితో ఎ విధమైన చర్చలకి తావే లేదని తేల్చి చెప్పే విధంగా వారి దాడులకి సమాధానం చ్వేబుతుంది.మరో వైపు పాకిస్థాన్ ఏమైనా దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తే గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న భారత రక్షణ శాఖ త్రివిధ దళాలని సిద్ధం చేసి, మూడు రోజులు పూర్తి అప్రమత్తంగా వుండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక సరిహద్దులో పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ పర్యావేక్షిస్తూ వుంది.