మొత్తానికి ప్రపంచకప్ లో కధ కంచి కి పాక్ ఇంటికి

మొత్తానికి అంత కొడతాం ఇంత కొడతాం అంటూ చెప్పిన ప్రగల్భాలు ఏమాత్రం నెరవేరలేదు.ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్ లో భారీ రన్ రేట్ తో గెలవాల్సి ఉండడం తో పాక్ ఏమాత్రం తన సత్తా చాటుకోలేకపోయింది.

 Pakistan Out From Icc World Cup-TeluguStop.com

కనీసం 300 లకు పైగా రన్స్ తేడా తో విజయాన్ని అందుకోవాల్సిన పాక్ కేవలం నిర్ణీత 50 ఓవర్ల లో 315 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీనితో పాక్ జట్టుకు సెమీస్ అవకాశాలు ఇక లేనట్లే.

నేరుగా ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు బయటకి వచ్చేసింది.ఎందుకంటే 315 పరుగులే చేయడం తో పాక్ కు ఛాన్స్ మిస్ అయ్యింది.

ఒకవేళ బంగ్లా జట్టును 7 పరుగులకే ఆలౌట్ చేసినా ఆ జట్టుకు ఛాన్స్ ఉండేది.కానీ అది కూడా సాధ్యం కాకపోవడం తో ఇక పాక్ ప్రపంచకప్ నుంచి బయటకి వచ్చే పరిస్థితి వచ్చేసింది.

ఇక మూట ముల్లు సర్దుకొని ఇంటికి పోవాల్సిందే.పాక్-బంగ్లా మధ్య జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సర్ఫ్‌రాజ్‌ సేన 94 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి న్యూజిలాండ్‌తో 11 పాయింట్లతో సమానంగా నిలిచినా… కివీస్‌ మెరుగైన రన్‌రేట్‌తో నాకౌట్‌కు చేరడం తో పాక్ కు ఆ అవకాశం మిగలలేదు.

మొత్తానికి ప్రపంచకప్ లో కధ కం�

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్ట నష్టానికి 315 పరుగులు చేసింది.ఇమామ్‌ ఉల్‌ హక్‌ 100, బాబర్‌ ఆజమ్‌ 96 పరుగులు చేయడంతో పాక్‌కు ఆ మాత్రం స్కోర్ సాధ్యమైంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ వైఫల్యంతో బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది.షకీబల్‌ హసన్‌ 64 పరుగులతో మెరుగైన స్కోర్ మినహా ఆ జట్టులో ఎవరూ కూడా పెద్దగా రాణించలేకపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube