ఫలించని ప్రార్ధనలు పాక్ సెమీస్ ఆశలు ఆవిరైనట్లేనా  

Pakistan No Chance To Go World Cup Semifinals-india,new Zeland,no Chance To Go,pakistan,world Cup Semifinals

ప్రపంచ కప్ సెమీస్ కు చేరాలని ఆశపడిన పాకిస్థాన్ కు నిరాశే తప్పడం లేదు. వారి ఆట విషయం పక్కన పెడితే, ఇటీవల ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలవాలి అని ప్రార్ధనలు చేశారు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవాలని ప్రార్ధనలు చేశారు..

ఫలించని ప్రార్ధనలు పాక్ సెమీస్ ఆశలు ఆవిరైనట్లేనా -Pakistan No Chance To Go World Cup Semifinals

కానీ రెండు ప్రార్ధనలు వృధా అయినట్లే కనిపిస్తుంది. మొన్న ఇంగ్లాండ్ ఓడిపోవాలని కోరగా,నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం కివీస్ పై ఇంగ్లాండ్ గెలవాలని కోరుకుంది. కానీ రెండు మ్యాచ్ లలో పాక్ కోరిక ఓడిపోయింది.

ఇప్పటికే పాయింట్ల పట్టిక లో 5 వ స్థానంలో ఉన్న పాక్ జట్టు నాలుగో స్థానంలో ఉన్న కివీస్ ను వెనక్కి నెట్టాలి అంటే బంగ్లా తో తలపడబోయే మ్యాచ్ లో కనీసం 316 పరుగుల తేడాతో నెగ్గాల్సి ఉంది. దీనితో సెమీస్ లో పాక్ ఆడాలన్న కోరిక తీరడం అనేది కష్టమే అని అనిపిస్తుంది.

అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతోఆస్ట్రేలియా(14), భారత్‌(13) ఇంగ్లాండ్‌(12) తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఆజట్టు నెట్‌ రన్‌రేట్‌ 0.175 9 పాయింట్లతో ఉన్న పాక్‌ (5వ స్థానం) నెట్‌ రన్‌ రేట్‌(-0.792). తన చివరి మ్యాచ్‌లో ఒకవేళ బంగ్లాదేశ్‌పై గెలిస్తే 11 పాయింట్లతో కివీస్‌ణు సమం చేయగలుగుతుంది. కాని పాకిస్థాన్‌ రన్‌రేట్‌లో ఆ జట్టును దాటడం దాదాపు అసంభవమే. మరి పాక్ సెమీస్ ఆశలు దాదాపు ఆవిరి అయినట్లే అనిపిస్తుంది.