పాక్ కి యుద్ధ ఖైదిగా చిక్కిన అభినందన్ ఈ రోజు రిలీజ్ చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.ఇక దేశం యావత్తు అభినందన్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయు.
వాఘా సరిహద్దు వద్ద అతనికి గ్రాండ్ వెల్ కం చెప్పడానికి అందరూ రెడీ అయ్యారు.అయితే ఇలాంటి టైం లో పాకిస్తాన్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.
యుద్ధ ఖైదిగా దొరికిన అభినందన్ ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా విడుదల చేస్తుందని ఆ దేశానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఇస్లామాబాద్ కోర్ట్ లో పిటీషన్ వేసాడు.ఈ పిటీషన్ నేపధ్యంలో అభినందన్ రిలీజ్ విషయంలో సందిగ్ధం నెలకొంది.
ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్ట్ తీర్పు చెబితే అభినందన్ రిలీజ్ ఆలస్యం అయ్యే అవకాశాలు వున్నాయి.ఈ నేపధ్యంలో కోర్ట్ ఎం చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.