ఎప్పుడో ఆదివారం ప్రారంభమయ్యే మ్యాచ్ కు.. అప్పుడే తన టాలెంట్ చూపిస్తున్న పాక్  

Pakistan Made A Video To Insulting The Abhinandan-

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఈ ఆదివారం మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.అయితే అప్పుడే పొరుగుదేశం పాకిస్థాన్ కవ్వింపు ప్రక్రియను మొదలుపెట్టింది.ఇంకా ఈ మ్యాచ్ ప్రారంభంకాకుండానే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి ఓ పాకిస్థాన్ టీవీ ఛానల్...

Pakistan Made A Video To Insulting The Abhinandan--Pakistan Made A Video To Insulting The Abhinandan-

భారత్ వింగ్ కమాండర్ అభినందన్‌ను అవమానించేలా ఒక వీడియో ను రూపొందించింది.అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

గత కొంత కాలంగా భారత్-పాక్ సరిహద్దులో చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య ఈ రెండు దేశాలు కూడా ఎలాంటి టోర్నిలలో ఆడడం లేదు.అయితే ప్రపంచ కప్ లో ఈ రోజు దేశాలు తలపడనుండడం తో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే దీనిని అవకాశంగా తీసుకున్న పాక్ ఛానల్ ఒకటి ఒక వీడియోను రూపిందించింది.

Pakistan Made A Video To Insulting The Abhinandan--Pakistan Made A Video To Insulting The Abhinandan-

అది కూడా భారత వింగ్ కమాండర్ అభినందన్ ను కించపరుస్తూ ఆ వీడియో ఉంది.ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ భారత్ పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు దిగిన సంగతి తెలిసిందే.ఇందులో భారత్ విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించాడు వింగ్ కమాండర్ అభినందన్.

అయితే దురదృష్టవశాత్తు ఆయన ఈ ఆపరేషన్‌లో పాక్ చేతికి చిక్కగా,ఆయన్ని చిత్ర హింసలకు గురి చివరికి అంతర్జాతీయ దేశాల నుంచి ఒత్తిడి రావడం తో చేసేదేమి లేక పాక్ అభినందన్ ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు భారత్-పాక్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో అభినందన్ మీసకట్టు తో టీమిండియా జెర్సీ ధరించిన ఒక నటుడిని ప్రపంచ కప్ గురించి ప్రశ్నిస్తూ ఉంటారు.అయితే ఆ వీడియో లో ఆ వ్యక్తి కప్ లో టీ తాగుతూ ఉండగా, టాస్ గెలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.సారీ…నేనేమీ చెప్పకూడదు అంటూ సమాధానం చెబుతాడు.అలానే మరో రెండు ప్రశ్నలకు కూడా అలాంటి సమాధానం చెబుతాడు.చివరిగా కప్ తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోతున్నా సమయంలో ఆగు కప్ ఎక్కడకి తీసుకెళుతున్నావ్ అంటూ ఆ కప్ లాక్కుంటారు.ఇదంతా కూడా ఆ వీడియో లో ఉంది.

ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.అభినందన్ పాక్ చేతికి చిక్కినప్పుడు ఎన్ని చిత్ర హింసలకు గురి చేసిన వారు అడిగిన ప్రశ్నలకు నేను అవి చెప్పకూడదు అంటూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో అభినందన్ చూపిన తెగువకు నెటిజన్లు అందరూ ఫిదా అయిపోయారు...

అయితే అప్పటి అభినందన్ సమాధానాన్ని ఎత్తి చూపుతూ పాక్ ఈ విధంగా కవ్వింపు వీడియో ను చిత్రీకరించింది.