పసికూన చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్..

మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో పసికున ఆయన థాయిలాండ్ పాకిస్తాన్ ను చిత్తు చేసి సంచలన విజయం నమోదు చేసింది.పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని థాయిలాండ్ అందుకుంది.

 Pakistan Lost In The Hands Of The Girl ,  Asia Cup,pakistan,thailand,pakistan Lo-TeluguStop.com

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 116 పరుగులు మాత్రమే చేసింది.వికెట్ కీపర్ మునిబా అలీ 14 బంతుల్లో రెండు ఫోర్ లతో 15 పరుగులు చేయగా కెప్టెన్ బిస్మామ్ మారూఫ్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ అయింది.

అమీన్ 64 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేయగా నిదా దర్ 22 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన థాయిలాండ్ మహిళల జట్టుకి ఆ జట్టు ఓపెనర్లు శుభారంభం అందించారు.తొలి వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం అందించిన తర్వాత మొదటి వికెట్ కోల్పోయింది.

కెప్టెన్ నరోమోల్ చైవాయ్ 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా వచ్చిన నథకన్ ఛాంతమ్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసింది.అయితే థాయిలాండ్ విజయానికి 12 పరుగులు కావాల్సిన సమయంలో నథకమ్ ఛాంతమ్ అవుటైంది.

ఛాంతమ్ అవుట్ అయ్యే సమయానికి థాయిలాండ్ విజయానికి 8 బంతుల్లో 12 పరుగులు కావాలి.

ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా డియానా బైగ్ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఫోర్ బాదిన రోజనన్ కన్నో ఆ తర్వాత కావలసిన పరుగులు చేసి విజయాన్ని సాధించింది.పాకిస్తాన్‌ మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో థాయిలాండ్ చేతుల్లో మొదటిసారి ఓడిపోయింది.తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన పాకిస్తాన్, థాయిలాండ్ చేతుల్లో ఓడి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది.

వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు, పాయింట్ల పట్టిక లో టాప్‌ లో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube