అవును, మీరు విన్నది నిజమే.భారత్ లో మోడీ ప్రభుత్వం( Modi Government ) కొన్నాళ్ల క్రితమే వివిధ రకాల ఫారిన్ సోషల్ మీడియా యాప్స్ లకు ప్రత్యామ్నాయ దేశీయ యాప్స్ రంగంలోకి దించిన సంగతి విదితమే.
ఈ క్రమంలో పలు రకాల దేశీయ యాప్స్ జనాల మన్ననలు పొందుతున్నాయి.మరి భారత్ కన్నా మేమేం తక్కువ అని ఫీల్ అయ్యారేమోగాని, పాకిస్తాన్ దేశం( Pakistan ) సొంతంగా ఓ యాప్ ను రూపొందించింది.
ఏకంగా వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ ను ప్రారంభించింది.

‘బీప్ పాకిస్తాన్'( Beep Pakistan ) పేరుతో అభివృద్ధి చేసిన యాప్ ను ఆ దేశ ఐటీ మంత్రి అమీనుల్ హక్ తాజాగా ఆవిష్కరించారు.వాట్సాప్ యాప్ కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ యాప్ ను రూపొందించిందని తాము గర్వంగా చెప్పగలమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.కాగా బీప్ పాకిస్తాన్ యాప్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఆ దేశ ఐటీ మంత్రి అమీనుల్ హక్( Pakistan IT minister Aminul Haque ) తెలిపారు.
దాదాపు 30 రోజుల పాటు దీన్ని పరీక్షిస్తామని.విజయవంతం అయిన తర్వాత ఏడాది పాటు ప్రభుత్వ స్థాయిలో ఉపయోగిస్తామన్నారు.

ఇక ఆ తరువాత అంటే సరిగ్గా ఏడాది తర్వాత పాక్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని గర్వంగా ప్రకటించారు.మొదటి దశలో ప్రభుత్వ అధికారులకు, రెండో దశలో మంత్రిత్వ శాఖలకు, మూడో దశంలో దేశ ప్రజలందరికి అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చారు.ఇకపోతే బీప్ పాకిస్తాన్ యాప్ లో వాట్సాన్ వలే చాటింగ్, ఆడియో, వీడియో, మీటింగ్ కాల్స్ చేసుకోవచ్చని చెబుతున్నారు.అంతేకాకుండా బీప్ పాకిస్థాన్ అప్లికేషన్‌లో డాక్యుమెంట్ షేరింగ్( Document Sharing ), సెక్యూర్డ్ మెసేజింగ్, కాన్ఫరెన్స్ కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పాక్ టెక్నాలజీ రంగంలో ఓనమాలు దిద్దడానికి రెడీ అయిపోయిందన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.