భరితెగించిన పాకిస్తాన్! ఇండియన్ ఆర్మీపై విషప్రయోగానికి ప్రయత్నం!  

ఇండియన్ ఆర్మీపై విష ప్రయోగానికి కుట్ర చేసిన పాకిస్తాన్ ఆర్మీ, బయటపెట్టిన ఇంటలిజెన్స్. .

Pakistan Isi Planning To Poison Attack On Security Forces-

ఓ వైపు అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతని, ఒత్తిడిని తట్టుకోలేక శాంతి మంత్రం జపిస్తున్న పాకిస్తాన్ ప్రభుతం, ఆ దేశం ఆర్మీ మరో వైపు ఇండియన్ మిలటరీ లక్ష్యంగా బోర్డర్ దగ్గర కాల్పులకి తెగబడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం సరిహద్దులో పాకిస్తాన్ ఆర్మీ బరితెగించి కాల్పులకి తెగబడటంతో ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది.పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులని భారత్ బలంగా తిప్పి కొడుతుంది..

Pakistan Isi Planning To Poison Attack On Security Forces--Pakistan ISI Planning To Poison Attack On Security Forces-

ఇదిలా వుంటే పాకిస్తాన్ ఆర్మీ కి సంబంధించిన ఓ భయానక కుట్రని ఇంటలిజెన్స్ తాజాగా బయటపెట్టింది.ఇండియన్ ఆర్మీ లక్ష్యం పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఎస్ భారీ కుట్రకి ప్లాన్ చేసింది.కాశ్మీర్ లో తమకి సహకరించే పౌరుల సహాయంతో ఇండియన్ ఆర్మీకి వెళ్ళే ఆహారంలో విషపదార్ధాలు కలిపి దొంగ దెబ్బ తీయాలని ప్లాన్ చేసినట్లు ఇంటలిజెన్స్ పసిగట్టింది.

ఈ విషయాన్ని సరిహద్దులో భద్రతా దళాలకి తెలియజేయడంతో ప్రస్తుతం ఆర్మీ క్యాంపులోకి వచ్చే ఆహార పదార్ధాలని క్షుణ్ణంగా తనికి చేస్తున్నట్లు తెలుస్తుంది.ఓ విధంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా భారత్ సాధించిన దౌత్యపరమైన విజయాన్ని భరించలేక పాకిస్తాన్ ఆర్మీ ఈ రకమైన కుట్రలకి తెరతీస్తుంది అని తెలుస్తుంది.