బరువు తగ్గాలి అన్న కోరిక కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు  

Pakistan Heaviest Man Nooru Hassan Dies Because Of Hospital Negligence-pakistan Heaviest Man Nooru Hassan,telugu Viral News Updates,viral News Updates

పాకిస్థాన్ కు చెందిన నూరుల్ హాసన్ అనే స్థూలకాయకుడు గా అత్యంత కష్టం మీద లాహోర్ ఆసుపత్రి లో చేరాడు. బరువు తగ్గించుకోవాలి తోటి వారితో కలిసి తిరగాలి అన్న ఒక్క ఉద్దేశ్యమే ఏంతో కష్టం అయినా కూడా ఆసుపత్రికి తెరలివెళ్లాడు. అయితే ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరిన అతడికి అదే ఆఖరి చూపు అనేది అతడికి తెలియలేదు..

బరువు తగ్గాలి అన్న కోరిక కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు -Pakistan Heaviest Man Nooru Hassan Dies Because Of Hospital Negligence

అతడిని చూసిన వైద్యులు శరీరంలో కొవ్వు తీసేశారు కూడా. అయితే కొన్ని రోజుల పరీక్షల కోసం అతడిని ఐసీయూ లో ఉంచగా, ఆ పొరపాటే అతడి పాలిట శాపం గా మారింది. కొద్దిరోజుల్లో ఇంటికెళ్తాననే అతడి ఆశలను అడియాసలు చేసింది.

జీవితంపై ఆశలతో వచ్చిన అతడికి జీవితమే లేకుండా అయిపొయింది. నూరుల్ హసన్ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు 400 కిలోమీటర్ల దూరంలో గల సాదిక్‌బాద్ స్వస్థలం. నూరుల్ బరువు 330 కిలోలపైనే ఉంటారు. దీంతో అందరిలాగా తాను ఉండాలనుకున్నాడు. ఈ క్రమంలోనే లాహోర్ ఆసుపత్రిలో చేరాడు.

దీనితో ఆసుపత్రి వైద్యులు కూడా అతడికి శస్త్ర చికిత్స నిర్వహించి కొవ్వు ను కూడా తీసేశారు. అయితే ఆపరేషన్ తర్వాత మరి కొన్ని పరీక్షలు నిర్వహించాలని అతడిని వైద్యులు ఐసీయూలోకి మార్చారు. అయితే అబ్జర్వ్ చేద్దామని ఉంచితే అతని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురైంది.

హసన్ చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రిలో ఓ మహిళ చనిపోయింది. దీంతో ఆమె తరఫు బంధువులు ఆగ్రహం తో ఆసుపత్రి పై అలానే వైద్యుల పై దాడికి దిగారు.

ఈ క్రమంలో ఆసుపత్రి లోని కిటికీలు పగలగొట్టి, వెంటిలేటర్లు ఆఫ్ చేసి తీవ్ర స్థాయిలో బీభత్సం సృష్టించారు. దీనితో ఆస్పత్రిలో తీవ్ర గందరగోళం నెలకొనడం తో ఎక్కడ సిబ్బంది అక్కడే దాక్కున్నారు.

దీంతో ఐసీయూలో ఉన్న రోగులను పట్టించుకొనే వారు కూడా లేకపోవడం తో అక్కడ రోగుల పరిస్థితి ప్రమాదంలో పడింది. దీనితో ఈ క్రమంలోనే హాసన్ కూడా అస్వస్తతకు గురికావడం తో హసన్ తో పాటు మరో రోగి కూడా మృతిచెందాడు. అయితే ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు..