మనీ లాండరింగ్ కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారీ అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది.మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అకౌంటబిలిటీ బ్యూరో బృందం ఆసిఫ్ ని అదుపులోకి తీసుకుంది.
పీపీపీ సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.అయితే ఆయన పెట్టిన బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురైన కొద్ది గంటల్లోనే ఆసిఫ్ అరెస్ట్ అయ్యారు.
మనీలాండరింగ్ కేసులో జర్ధారీ తో పాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ లు ప్రధాన నిందితులుగా ఉన్నారు.అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో జర్దారీ ని తొలుత అరెస్ట్ చేశారు అధికారులు.అయితే ఆయనను కోర్టు లో ప్రవేశపెట్టే వరకు ఎన్ఏబీ కార్యాలయంలోనే ఉంచుతారని సమాచారం.జర్దారీ అరెస్టుపై సోదరి ఫర్యాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.పాక్ ప్రధానిగా బేనజిర్ భుట్టో 1988-1990, 1993-1996 సంవత్సరాల్లో పనిచేయగా, ఆమె భర్త జర్దారీ అధ్యక్షుడిగా 2008-2013 సంవత్సరాల మధ్య పనిచేసిన సంగతి తెలిసిందే.