లగ్జరీ వెహికల్స్ కేసులో పాక్ మాజీ అధ్యక్షుడికి జారీ అయిన అరెస్ట్ వారెంట్

లగ్జరీ వెహికల్స్ కేసుకు సంబంధించి పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారీ కి యాంటీ కరప్షన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తుంది.2008 నాటి ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకాని కారణంగా జర్ధారీ పై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.జర్దారీకి బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేస్తున్నట్లు అకౌంటబిలిటీ కోర్టు జడ్జి అస్ఘర్ అలీ ప్రకటించిన ఆయన, తదుపరి విచారణ ను ఆగస్టు 17న జరుగుతుందని తెలిపారు.మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, యూసఫ్ రజ గిలానీలకు లగ్జరీ కార్లుకు అసలు ధరల్లో 15 శాతం మాత్రమే చెల్లించారని మిగతా డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి వాడారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 Arrest Warrant Issued Against Pakistan Ex-pm In Luxury Vehicles Case, Luxury Veh-TeluguStop.com

ఈ క్రమంలో కేసు విచారణకు హాజరు కావలి అని పలుమార్లు కోర్టు ఆదేశాలు చేసినప్పటికీ కూడా ఆయన కోర్టు కు హాజరు కాలేదు.జర్ధారీ తరపు న్యాయవాది ఫరూక్ నాయక్ తన క్లయింట్ వయసు పై బడినవారు అని కరోనా మహమ్మారి నేపథ్యంలో కోర్టు కి హాజరుకాలేకపోతున్నారు అంటూ కోర్టుకు తెలిపినప్పటికీ కోర్టు తప్పుపట్టింది.

ఆయన ఈ సమయంలో కోర్టుకు హాజరు అయితే కరోనా సోకుంది అని అందుకే కరోనా పరిస్థితి మెరుగుపడేంత వరకు కోర్ట్ హాజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇవ్వాలి అంటూ జర్ధారీ తరపు లాయర్ చేసిన అభ్యర్ధనను కూడా కోర్టు తిరస్కరిస్తూ పై మేరకు తీర్పు వెల్లడించినట్లు తెలుస్తుంది.ఈ కేసులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, యూసుఫ్ రాజా గిలానీ కూడా ఉన్నారు.

అయితే నవాజ్ షరీఫ్ ప్రస్తుతం మెడికల్ పేరోలపై లండన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

Telugu Warrantpakistan, Luxury Vehicle, Nawaz Sharif, Pakistan Pm-Telugu NRI

మెడికల్ పెరోల్‌పై లండన్‌లో ఉన్న మాజీ ప్రధాని షరీఫ్ కూడా విచారణకు హాజరుకాకపోవడం తో మునుపటి విచారణలో అతని అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది.అంతేకాకుండా ఆయనను వాంటెడ్ నేరస్థుడిగా ప్రకటించే ప్రక్రియను కూడా ప్రారంభించాలని కోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube