తనకు ఏయిడ్స్‌ ఉందని 400 మందికి... ఇతడిని ఏం చేయాలో మీరే చెప్పండి

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది.ఒక డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 400 మందికి ఎయిడ్స్‌ వ్యాది సోకింది.

 Pakistan Doctor Arrested After 400 Children Diagnosed With Hiv 400-TeluguStop.com

దాయాదీ దేశంలో ఇప్పటికే ఎయిడ్స్‌ తారా స్థాయిలో ఉంది.ఆసియా ఖండంలోనే అత్యధిక ఎయిడ్స్‌ రోగులు ఉన్న దేశంగా ముందు వరుసలో ఉన్న పాకిస్తాన్‌ ఇప్పుడు ఈ సంఘటనతో మరోసారి ఎయిడ్స్‌ విషయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఒక డాక్టర్‌ చేసిన పనికి 400 మంది ఎయిడ్స్‌ బారిన పడ్డారు.వారిలో ఎక్కువ శాతం చిన్న పిల్లలు ఉండటం మరీ దారుణం.

ఈ విషయమై పాకిస్థాన్‌ ప్రభుత్వం మరియు ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహంతో ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… పాకిస్తాన్‌లోని లర్కానా జిల్లా రటోడెరో అనే ప్రాంతంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్‌ ఉంది.

ఆ హాస్పిటల్‌కు రావాల్సిన మందులు, సిరంజీలు రాలేదు.సిరంజీలు రాకపోవడంతో డాక్టర్‌ ఒకరికి ఉపయోగించినవి మరోకరికి అలా వందలాది మందికి వినియోగించాడు.

అది ఎవరి నుండి ప్రారంభం అయ్యిందో కాని పెద్ద ఎత్తున ఎయిడ్స్‌ వ్యాదిని వ్యాపింపజేసింది.నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.ఈ క్రమంలో అతడికి కూడా ఎయిడ్స్‌ ఉందని డాక్టర్లు నిర్ధారించారు.

తనకు ఏయిడ్స్‌ ఉందని 400 మందికి

తనకు ఎయిడ్స్‌ ఉన్న విషయం తెలియదు అంటూ అతడు చెబుతున్నాడు.కాని తనకున్న ఎయిడ్స్‌ అందరికి రావాలనే ఉద్దేశ్యంతోనే అతడు తాను వాడుకున్న సిరంజీని ఇతరులకు వాడి ఉంటాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.400 మంది మాత్రమే కాకుండా గత సంవత్సర కాలంలో అతడి వద్ద ఇంజక్షన్‌ వేయించుకున్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.వారికి వైధ్య పరీక్షలు చేయిస్తున్నారు.

ఈ సంఖ్య ముందు ముందు మరింత పెరుగుతుందేమో అనే భయాందోళనలో పోలీసులు ఉన్నారు.పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న కారణంగా వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube