పాపం... ఆ క్రికెటర్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి అలాంటి వీడియోలకి లైక్ చేసారని...

ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారి సోషల్ మీడియా మాధ్యమాలను హ్యాక్ చేసి, పలు అసాంఘిక కార్యకలాపాలను సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తూ సెలబ్రిటీలకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు.తాజాగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్  ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి పలు అశ్లీల వీడియోలకి  లైక్ మరియు కామెంట్ చేయడంతో చివరికి ఆ క్రికెటర్ సోషల్ మీడియా నుంచి తప్పుకున్న ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.

 Waqar Younis, Pakistan Cricketer, Twitter Account Hacked, Pakistan-TeluguStop.com

వివరాల్లోకి వెళితే తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని అంతేగాక తన ఖాతా ద్వారా పలు అశ్లీల వీడియోలకి లైకులు కూడా కొట్టారని, ఈ కారణంగా తన పరువు, ప్రతిష్టలకు కొంతమేర భంగం కలిగినట్లు తెలిపాడు.అలాగే తాను ఇక నుంచి సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించబోనంటు తెలిపాడు.

ఈ విషయం తెలుసుకున్న టువంటి పలువురు నెటిజన్లు వకార్ యూనిస్ చేసినటువంటి వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు.అంతేగాక మరికొంతమంది అయితే ప్రస్తుత కాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తూ పలు అసాంగీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాబట్టి అలాంటి వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే పాకిస్తాన్ దేశం తరఫున వకార్ యూనిస్ దాదాపుగా 13 సంవత్సరాల పాటు బౌలర్ గా జట్టుకి సేవలందించాడు.ఇందులో భాగంగా  టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి దాదాపుగా 340 కి పైగా మ్యాచ్ లను ఆడాడు.

ఈ క్రమంలో లో 700కి పైగా వికెట్లను కూడా పడగొట్టాడు.అంతర్జాతీయ క్రికెట్ కి 2003వ సంవత్సరంలో వీడ్కోలు పలికాడు.ప్రస్తుతం ఆ దేశానికి బౌలర్ బౌలింగ్ కోచ్ గా సేవలు అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube