రోహిత్ దెబ్బకి సచిన్ గుర్తొచ్చాడంటున్న పాక్ బౌలర్...  

Pakistan Bowler Akhtar Doing Comments On Rohit Sharma-rohit Sharma,rohit Sharma And Sachin,rohit Sharma Latest News,rohit Sharma News,sachin News

తాజాగా భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఆఖరి మ్యాచ్ నెగ్గి వన్డే సిరీస్ ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా కోహ్లీ సేన అలవోకగా 47.3 ఓవర్లలో ఛేదించారు.ఇందులో మొదటగా ఆస్ట్రేలియా జట్టులో మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సెంచరీతో కదం తొక్కగా నూతన్ ఆటగాడు లాబ్స్ చేంజ్ అర్థ సెంచరీతో రాణించాడు.

Pakistan Bowler Akhtar Doing Comments On Rohit Sharma-Rohit Sharma Rohit And Sachin Latest News

అయితే ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ తనకు బాగా కలిసి వచ్చినటువంటి గ్రౌండ్లో సెంచరీతో కదం తొక్కాడు. అలాగే విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో మ్యాచ్ ని ముగించాడు.

అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.

ఇందులో భాగంగా భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ బౌలర్లపై అసలు కనికరం చూపించకుండా ఉతికి ఆరేసాడని అన్నారు.అంతేగాక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మని చూస్తుంటే తనకు ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుర్తుకొచ్చాడని చెప్పుకొచ్చాడు.

అంతేగాక  ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాట్స్ మెన్ లలో సచిన్ లాగా మంచి క్వాలిటీ షాట్లు ఆడే సత్తా భారత జట్టులో కేవలం ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే ఉందని కితాబిచ్చాడు.అంతేగాక ప్రస్తుతం రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడని అతడిని సరిగ్గా ఉపయోగించుకుంటే జట్టుకు మరింత మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు.

అలాగే 2019 వ సంవత్సరం ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న టువంటి రోహిత్ శర్మకి శుభాకాంక్షలు తెలిపాడు.

తాజా వార్తలు

Pakistan Bowler Akhtar Doing Comments On Rohit Sharma-rohit Sharma,rohit Sharma And Sachin,rohit Sharma Latest News,rohit Sharma News,sachin News Related....