భారత్ పై ఉగ్రపోరాటానికి ఏకం అవుతున్న ఉగ్రవాద సంస్థలు

జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఇంతకాలం ఉన్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ని విడగొట్టి మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసుకొని అక్కడి పెత్తనాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.ఆర్టికల్ 370 ఉపయోగించుకొని భారత్ లోకి చొరబడి ఇక్క ఉగ్రవాద దాడులు చేసి పాకిస్తానీకి భారత్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 Pakistan Based Terror Groups Planning Multiple Infiltration Bids1-TeluguStop.com

ఈ ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ యువత ని ఉగ్రవాదం వైపు నడిపించిన పాకిస్తాన్ లకి ఇక్కడ అండ లేకుండా పోయింది.దీంతో ఎలాగైనా భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ గూడచార సంస్థ ఐఎస్ఐ తో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది.

ఇక భరత్ మీద ప్రతీకారంతో రగిలిపోతున్న ఉగ్రవాద సంస్థలు సిరియా ఉగ్రవాద సంస్థ అయిన ఐఎస్ఐతో చేతులు కలిపింది.

ఈ నేపధ్యంలో ఐసిస్‌ మద్దతుతో జైషే, లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈనెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ విధ్వంసానికి కుట్ర చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

భారత్ ని విచ్చిన్నం చేసే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఆర్మీ అండదండలతో ఈ ఉగ్రవాద సంస్థలు పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.బక్రీద్‌ ప్రార్థనల్లోనూ పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

దీంతో అధికారులు భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆ దేశ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.

ఈ మాటల వల్లే ఉగ్రమూకలు మరింత రెచ్చిపోతున్నాయనేది ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube