పాక్‌ టీ స్టాల్‌లో అభినందన్‌ ఫ్లెక్సీ... దానిపై ఏం రాసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు  

  • ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ ఒక్కసారిగా హీరో అయ్యాడు. పాకిస్థాన్‌ యుద్ద విమానం బారి నుండి మన దేశంకు చెందిన ఆర్మీ క్యాంపులను కాపాడి, పాక్‌ విమానాన్ని తరిమి కొట్టి దాన్ని కూల్చి వేసిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పొరపాటున పాక్‌ భూ భాగంలో పడ్డ విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఇండియన్‌ అధికారుల ఒత్తిడి మరియు ఇతరత్ర కారణాల వల్ల తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అభినందన్‌ పాకిస్థాన్‌లో ఉన్న సమయంలో అక్కడి ఆర్మీ వారు ఆయన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ వీడియో తీసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో పాకిస్థాన్‌ టీ తనకు నచ్చిందన్నాడు.

  • పాకిస్థాన్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత అభినందన్‌ గురించి ఇండియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో పాకిస్థాన్‌లో కూడా కొందరు అభినందన్‌కు ఫిదా అయ్యారు. ఆయన్ను అభినందించడంతో పాటు, కొందరు ఆయన్ను సాహస వీరుడిగా కొనియాడుతున్నారు. అభినందన్‌ గురించి పాకిస్థాన్‌లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆ మద్య ఒక టీ పౌడర్‌ కంపెనీకి అభినందన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత పాకిస్థాన్‌లో అభినందన్‌ పలు రకాలుగా సందడి చేస్తూనే ఉన్నాడు.

  • Pak Tea Seller Uses Abhinandan's Photo To Sell Friendship Tea-Friendship Iaf Abhinandan Karachi Pakistan

    Pak Tea Seller Uses Abhinandan's Photo To Sell Friendship Tea

  • తాజాగా పాకిస్థాన్‌ కరాచీలోని ఒక గల్లీలో చిన్న టీ స్టాల్‌ ఉంటుంది. ఆ టీస్టాల్‌ ముందు అభినందన్‌ ఉన్న ప్లెక్సీ పెట్టడం జరిగింది. అభినందన్‌ టీ తాగుతూ ఉన్న ఫొటోను ఆ ప్లెక్సీ మీద పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆ ప్లెక్సీ మీద ”ఖాన్‌ టీ స్టాల్‌… ఇక్కడి టీ తాగితే శత్రువులు కూడా మిత్రులు అవుతారు’ అంటూ రాసి పెట్టాడు. బ్యానర్‌ మీద కామెంట్‌కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. అభినందన్‌ ప్లెక్సీ పెట్టిన తర్వాత తన టీ అమ్మకాలు బాగా పెరిగాయని ఖాన్‌అంటున్నాడు. మరో వైపు కొందరు ఖాన్‌ తీరును తప్పుబడుతున్నారు. శత్రు దేశం వ్యక్తిని హీరోలా చూపించే ప్రయత్నం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అభినందన్‌ను అక్కడ కూడా తెగ వాడేసుకుంటున్నారు. ఇండియాలో అభినందన్‌ మీసకట్టు కోసం యూత్‌ తెగ ఆరాట పడుతున్న విషయం తెల్సిందే.