అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డ్ నెలకొల్పింది కానీ....!  

Pak Sets A Record In International Cricket...but-international Cricket,naughtingham,one Day Format,pakistan,అంతర్జాతీయ క్రికెట్,ఇంగ్లాండ్

ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్లో రికార్డ్ నెలకొల్పి మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు. ఈ అనుభవం పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు ఎదురైంది. వన్డే ఫార్మాట్లో వరుసగా మూడు మ్యాచ్ లలో 340కి పైగా పరుగులు సాధించిన ఏకైక జట్టుగా పాక్ నిలిచి రికార్డ్ సృష్టించింది. కానీ దురదృష్టం ఆ జట్టు ఓటమిపాలైంది..

అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డ్ నెలకొల్పింది కానీ....!-Pak Sets A Record In International Cricket...but

ఆ జట్టు నమోదు చేసిన అరుదైన ఘనతను. కొన్ని గంటల తర్వాత ఆ రికార్డు సాధించిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ నిలవడం విశేషం.

మొదటి మూడు మ్యాచ్ లలో పాక్ ఈ ఘనత సాధించగా నాటింగ్ హమ్ లో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ కూడా ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.

తర్వాతి మూడు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ వరుస మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఐదో వన్డే ఆదివారం లీడ్స్ లో జరగనుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టులో బాబర్ అజాం(115), ఫకార్ జమాన్(57), షోయబ్ అక్తర్(41) రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్(114), బెన్స్టోక్స్(71), జేమ్స్ విన్స్(43), టామ్ కర్రన్(31) మెరుపులు మెరిపించడంతో ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. దీనితో అరుదైన రికార్డ్ నెలకొల్పిన పాక్ చివరికి సిరీస్ నే కోల్పోవాల్సి వచ్చింది.