జెనీవా ఒప్పందంకు భయపడ్డ పాక్‌, అందుకే అభినందన్‌ సెకండ్‌ వీడియో.. జెనీవా ఒప్పందం ఏంటో తెలుసా?

భారత గగనతలంలోకి వచ్చిన పాకిస్థాన్‌ యుద్ద విమానాలను విరోచితంగా వెనక్కు పంపించిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌ విక్రమ్‌ అభినందన్‌ విమానంలో తలెత్తిన టెక్నికల్‌ ఇష్యూల కారణంగా పాకిస్తాన్‌ లో పారాచూట్‌ సాయంతో ల్యాండ్‌ అయిన విషయం తెల్సిందే.పాకిస్థాన్‌ గగనతలంలోకి దూసుకు వెళ్లి అక్కడ క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన మింగ్‌ నుండి అదృష్టవశాత్తు ప్యారచూట్‌ సాయంతో అభినందన్‌ బయట పడ్డాడు.

 Pak Releases Second Video Of Abhinandan For The Reason Of Geneva-TeluguStop.com

అయితే పాకిస్థాన్‌కు చిక్కడంతో ఆయన్ను చిత్ర హింసలు పెడుతున్నారు.

మామూలుగా అయితే పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కిన వారిని వెంటనే చంపేసే అవకాశం ఉంది.కాని అభినందన్‌ వీడియోలు బయటకు రావడంతో జెనీవా ఒప్పందంకు భయపడి ఆయన్ను ఏం చేయకుండా మర్యాదలు చేస్తూ ఉంది.జెనీవా ఒప్పందంను ఉల్లంఘిస్తే పరిస్థితులు ఏంటో వారికి బాగా తెలుసు.

అందుకే జెనీవా ఒప్పందంను ఉల్లంఘించకుండా అభినందన్‌ను పాకిస్థాన్‌ త్వరలోనే ఇండియాకు అప్పగిస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.అభినందన్‌ బాగానే ఉన్నాడని, ఆయన టీ తాగుతున్న వీడియోను, పాకిస్థాన్‌ ఆర్మీ తనకు ఎలాంటి హాని తలపెట్టలేదనే వీడియోను విడుదల చేశారు.

జెనీవా ఒప్పందంకు కట్టుబడి ఆ వీడియోను విడుదల చేశారు.

ఇంతకు జెనీవా ఒప్పందం ఏం చెబుతుందంటే…

1949లో జెనీవా ఒప్పందం చేసుకోవడం జరిగింది.ఇండియా మరియు పాకిస్థాన్‌తో పాటు దాదాపు 200 దేశాలు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.ఈ ఒప్పందం ప్రకారం శత్రు దేశానికి చెందిన జవాన్‌లు ఎవరైనా గాయాలతో చిక్కితే వారిని చంపకూడదు.

వారికి చికిత్స అందించి, వారిని క్షేమంగా తిరిగి దేశానికి పంపించాలి.శత్రు దేశానికి సంబంధించిన సైనిక స్థావరాల విషయాలను మరియు సైన్యంకు సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు శారీరకంగా గాని మానసికంగా కాని ఎవరిని వేదించవద్దు.

ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా యుద్ద ఖైదీల మాదిరిగా వదిలి పెట్టాలి.జెనీవా ఒప్పందంను పాకిస్థాన్‌ పాటిస్తే అభినందన్‌ క్షేమంగా ఇండియాకు తిరిగి వస్తాడు.ఒకవేళ జెనీవా ఒప్పందంను కనుక పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తే మాత్రం అంతర్జాతీయ కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది.

అభినందన్‌ త్వరగా తిరిగి ఇండియాకు రావాలని దేశ వ్యాప్తంగా జనాలు కోరుకుంటూ సర్వ మత ప్రార్థనలు చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube