గ్రౌండ్ లో వికెట్ తీసిన పాక్ బౌల‌ర్‌.. మాస్కు పెట్టుకుని సెల‌బ్రేష‌న్స్‌

క‌రోనా.క‌రోనా.క‌రోనా. ఇప్పుడు ఎక్క‌డ చూసినా కూడా దీనిపేరే బ‌లంగా వినిపిస్తోంది.ఏ ఊరు చూసినా.ఏ వాడ చూసినా స‌రే దీని పేరు బ‌లంగా వినిపిస్తోంది.

 Pak Bowler Who Took The Wicket On The Ground Celebrations Wearing A Mask Details-TeluguStop.com

అది చేర‌ని ప్రాంతం లేదు.అది రాని దీవి లేదు అన్న‌ట్టు వ్యాపిస్తోంది.

ఎన్ని వ్యాక్సిన్లు వ‌స్తున్నా స‌రే.రోజుకో వేరియంట్ రూపంలో అది దాడి చేస్తూనే ఉంది.

ఇప్పుడు కొత్త‌గా ఒమిక్రాన్ రూపంలో గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.ఈ వేరియంట్ అన్నింటి కంటే ప్ర‌మాద‌క‌రం అని ఇప్ప‌టికే డ‌బ్ల్యూహెచ్ వో ప్ర‌క‌టించింది.

అయితే ఇన్ని కేసుల న‌డుమ క్రికెట్ టోర్న‌మెంట్ లాంటివి అత్యంత జాగ్ర‌త్త‌ల‌తో నిర్వ‌హిస్తున్నారు.

ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా.

అన్ని రంగాల్లో కూడా క‌రోనా వ‌ల్ల మార్పులు వ‌చ్చాయి.క‌రోనా రాక‌ముందు ఒక‌ర‌కంగా జ‌రిగితే.

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌రో ర‌కంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నారు.అయితే ఇప్పుడు క్రికెట్ లో కూడా ఇలాంటి మార్పులే వ‌చ్చాయి.

దాంతో ఆ రంగంలో కూడా అనేక మార్పులు వ‌చ్చి ప‌డ్డాయి.క్రికెట్ లో ఒక‌ప్పుడు ఎవ‌రైనా బౌల‌ర్ వికెట్ తీస్తే.

అంద‌రూ అత‌ని వ‌ద్ద‌కు వ‌చ్చి హ‌గ్ చేసుకుని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.అంతే గానీ గ్రౌండ్ లో మాస్కు పెట్టుకున్న వారు మాత్రం ఎవ‌రూ లేరు క‌దా.

కానీ ఇప్పుడు పాక్ బౌల‌ర్ మాత్రం చాలా విభిన్నంగా చేశాడు.ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బిగ్ బాష్ లీగ్ లోపెర్త్ స్కార్చ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో పాక్ బౌల‌ర్ హారిస్ రౌఫ్ ఒక వికెట్ తీశాడు.అయితే ఇంత‌కు ముందులా సెల‌బ్రేట్ చేసుకోకుండా.అత‌ను వెంట‌నే అత‌ని జేబులో ఉన్న మాస్కును తీసి పెట్టుకున్నాడు.అంటే ఎవ‌రితో చేతులు క‌ల‌ప‌కుండా మాస్కు పెట్టుకోవాల‌ని జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ అత‌ను సందేశాన్ని ఇస్తున్నాడ‌న్న‌మాట‌.ఈ వీడియోపై ఇప్పుడు క్రికెట్ ప్ర‌పంచం విభిన్నంగా స్పందిస్తోంది.

మంచి మెసేజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube