ఇంటిలో ఉన్న గోడలకు ఏ రంగు వేస్తే శుభం,ధనప్రాప్తి కలుగుతుందో తెలుసా ?

ప్రపంచములో మనిషి గుర్తించే రంగులు కోట్లలో ఉన్నాయి.అయితే ఒక్కో మనిషి ఒక్కో రంగును ఇష్టపడతాడు.

 Paint Inner House Walls With Different Colors-TeluguStop.com

ఒకరు నలుపును ఇష్టపడితే మరొకరు తెలుపును ఇష్టపడవచ్చు.దుస్తులను కొనేటప్పుడు కూడా రంగును ఎంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.

అలాగే ఇంటి లోపల గోడలకు ఏ రంగు వేస్తే ఏమి జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

లైట్ బ్లూ
ఈ రంగును ఇంటి లోపల ఉన్న గోడలకు వేస్తే కుటుంబ సభ్యులు అందరు ప్రశాంతంగా ఉంటారు.

ఇంటిలోని వారికీ ఒత్తిడి,ఆందోళన తగ్గి సమస్యలను పరిష్కరించే శక్తి వస్తుంది.అంతేకాక సవాళ్ళను దైర్యంగా ఎదుర్కొంటారు.

లైట్ ఎల్లో
ఇంటి లోపల ఉన్న గోడలకు లైట్ ఎల్లో వేస్తే కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు.ఈ కలర్ ని పిల్లల బెడ్ రూమ్ లో వేస్తే వారు ప్రశాంతంగా ఉండటమే కాకుండా చదువులో బాగా రాణిస్తారు.

లైట్ గ్రీన్
గర్భంతో మహిళలు ఈ రంగు వేసిన గదిలో ఉంటే వారికి పుట్టబోయే బిడ్డ అందంగా,ఆరోగ్యంగా ఉంటాడు.పెళ్ళైన వారు ఈ రంగు గదిలో ఉంటే త్వరగా సంతానం కలుగుతుంది.
ఎరుపు
ఈ రంగు గదిలో ఉంటే దంపతుల మధ్య కలహాలు తగ్గి వారి మధ్య ప్రేమ,ఆప్యాయత పెరుగుతుంది.న‌వ దంప‌తులు ఇలాంటి రంగు ఉన్న బెడ్ రూంలో ప‌డుకుంటే వారి మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలురాకుండా జీవితం హాయిగా సాగుతుంద‌ట‌.

తెలుపు
తెలుగు రంగు గదిలో ఉంటే ఏకాగ్రత కుదురుతుంది.మెమొరీ పెరగటమే కాకుండా మానసిక శక్తి కూడా పెరుగుతుంది.

లావెండ‌ర్‌…
ఇంట్లో గోడ‌ల‌కు ఈ రంగు వేయిస్తే జ్ఞాప‌క‌శ‌క్తి మరియు మాన‌సిక శ‌క్తి పెరుగుతుంద‌ట‌.పాజిటివ్ ఎన‌ర్జీ ఇంట్లోకి వస్తుంది.

దీనితో అన్ని స‌మ‌స్య‌ల‌ను సులువుగా ప‌రిష్క‌రించుకోగ‌లుగుతార‌ట‌.

మ‌ట్టి రంగు…
ఈ రంగు గదిలో పడుకుంటే నిద్రలేమి సమస్య లేకుండా నిద్ర బాగా పడుతుంది.

అలాగే అనారోగ్య సమస్యలు కూడా దరికి చేరవు.

న‌లుపు…
ఇంటి లోపల, ఇంటి బయట ఎక్కడ నలుపు రంగు వేయించకూడదు.

ఇలా వేయిస్తే సమస్యలు వస్తాయి.వాస్తు పరంగా కూడా నలుపు మంచిది కాదు.

కాబట్టి సాధ్యమైనంత వరకు నలుపు రంగుకు దూరంగా ఉంటేనే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube