ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో నొప్పిలేని సుఖప్రసవం.. ఎలా అంటే..?!

ప్రసవ సమయంలో గర్భిణులు పురిటి నొప్పులు తట్టుకోలేక అల్లాడిపోతుంటారు.ప్రధానంగా నార్మల్​ డెలివరీలకు ప్రయత్నించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

 Painless Delivery In Government Hospitals , Free Delivery Device , Pregnant Wo-TeluguStop.com

దీంతో గర్భిణులు సిజేరియన్‌ను ఆశ్రయిస్తున్నారు.ఒకప్పుడు అవసరం లేకపోయినా సిజేరియన్‌ చేస్తున్నారనే ఒక అపవాదు వైద్యులపై ఉండేది.

కానీ ఇటీవల అవసరం లేకపోయినా కొందరు గర్భిణులే ఫలానా ముహూర్తంలో బిడ్డ పుడితే వాడి భవిష్యత్తు బాగుంటుందని కొందరు, పురిటి నొప్పులు భరించలేక ఇంకొందరు సిజేరియన్‌ను ఎంచుకుంటున్నారు.ఈమధ్యకాలంలో గర్భిణుల నుంచి ఇలాంటి మేటర్నల్‌ రిక్వె్‌స్టలు ఎక్కువవుతున్నాయి.

దీంతోనే తెలంగాణ రాష్ట్రం సీ సెక్షన్లలో ముందు వరుసలో ఉన్నది.ఆ పరిస్థితికి స్వస్తి పలికి, నొప్పుల సమస్యకు చెక్​ పెట్టేందుకు సర్కార్​ టెక్నాలజీని వినియోగించి కొత్త మిషన్లను అందుబాటులోకి తేనున్నది.

ఎంటానాక్స్ ‘అనే విధానంగా పిలువబడే ఈ మిషన్లతో నొప్పి లేని డెలివరీలను సులువుగా చేయొచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.ప్రసవ సమయంలో గర్భిణులకు పెయిన్​తేలియకపోవడంతో సాధారణ ప్రసవాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని కింగ్​కోఠి జిల్లా ఆసుపత్రిలో డెమో కూడా నిర్వహించారు.ఇద్దరు గర్భిణులకు నొప్పి తెలియకుండానే నార్మల్ డెలివరీలు చేశారు.

కరోనా ప్రవేశానికి ముందే ఈ ప్రయోగం సక్సెస్​ అయింది.అయితే సర్కార్​ ఆసుపత్రుల్లో ఈ విధానం అమల్లోకి రావడం మొట్ట మొదటి సారి ఇదే కావడం గమనార్హం.

ఇప్పటికే పెద్ద కార్పొరేట్​ఆసుపత్రుల్లో ఈ విధానంలోనే డెలివరీలు జరుగుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

Telugu Antonox, Delivery, Hospitals, Pregnant-Latest News - Telugu

మొదటిసారి డెలివరీలకు వచ్చేవారికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ గైనకాలజిస్టులు పేర్కొంటున్నారు.కింగ్​ కోఠి ఆసుపత్రిలో ఈ ఏడాది మార్చి నుంచి 80 శాతం నార్మల్​ డెలివరీలు చేస్తుండగా, 20 శాతం సీ సెక్షన్లు జరుగుతున్నాయి.ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోయే ఎండోనాక్స్​ సిస్టమ్‌తో సీ సెక్షన్లను మరింత తగ్గించవచ్చని ఆ ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube