కరోనా లక్షణాలు కనిపించకపోవడానికి అసలు కారణమిదే?

గడిచిన ఏడు నెలలుగా కరోనా మహమ్మారి భారత్ తో పాటు ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చాలామందిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపించాయి.

 Reason Behind Coronavirus Symptoms Not Shown, Corona, Symptoms, American Scienti-TeluguStop.com

అయితే ఆ తరువాత శాస్త్రవేత్తల పరిశోధనల్లో చాలామందికి కరోనా సోకినా లక్షణాలు కనిపించలేదని తేలింది.కొందరిలో లక్షణాలు కనిపిస్తూ, కొందరిలో కనిపించకపోవడానికి గల కారణాలు శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కలేదు.
కరోనా లక్షణాలు కనిపించక పోవడం వల్ల చాలామంది ఇష్టానుసారం బయట తిరుగుతూ పరోక్షంగా వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు.అయితే తాజాగా అమెరికాకు చెందిన పరిశోధనల బృందం పరిశోధనలు చేసి కరోనా లక్షణాలు కనిపించకపోవడానికి అసలు కారణాలను వెల్లడించింది.

కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్లే వైరస్ సోకినా కొందరిలో లక్షణాలు కనిపించడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

కరోనా వైరస్ లో ఉండే స్పైక్ ప్రోటీన్ నాడీ మండాలని నొప్పి తెలిసేలా చేసే రిసెప్టర్లను నిర్వీర్యం చేస్తుంది.

దీంతో కొందరిలో కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపిస్తుంటే మరి కొందరిలో లక్షణాలే కనిపించడం లేదు.యూనివర్సిటీ ఆఫ్ అరిజోనోకు చెందిన డాక్టర్ రాజేష్ ఖన్నా ఈ విషయాలను వెల్లడించారు.

నొప్పికి సంబంధించిన కారణాలపై 15 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

శరీరంలో నొప్పి తెలియడానికి వీఈజీఎఫ్ఏ ప్రోటీన్ కారణమవుతుందని.

కరోనా స్పైక్ ప్రోటీన్ కు ఈ ప్రోటీన్ కు సంబంధం ఉందనిరాజేష్ ఖన్నా వెల్లడించారు.మరోవైపు భారత్ లో గత 12 రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది.వైరస్ కొన్ని రాష్ట్రాల్లో అధిక ప్రభావం చూపడానికి మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ ప్రభావం చూపడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.2021 జులై నాటికి దేశంలోని 25 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్రం చెబుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube